Home తాజా వార్తలు నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను అందిస్తాం: కడియం

నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను అందిస్తాం: కడియం

Kadiyam-Srihari1

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య ఓ కొలికి వచ్చిందని డిప్యూటి సిఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. సభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు డిప్యూటి సిఎం సమాధానం ఇస్తూ, నాణ్యమైన ఇంజినీరింగ్ విద్యను అందిస్తున్నామని తెలిపారు. పక్క రాష్ట్రలకు వెళ్లి చదువుకుంటున్న విద్యార్థులకు మైగ్రేషన్ సర్టిఫికెట్లు ఇచ్చామని కడియం ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రంలోని విద్యార్థులు జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలు రాస్తున్నారని చెప్పారు . ఐఐటి, ఎన్‌ఐటీ వంటి సంస్థల్లో ప్రవేశాలు పొంది ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని తెలిపారు. వైద్య, వ్యవసాయ విద్యాసంస్థలు రాష్ట్రంలో తక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కడియం ఈ సందర్భంగా మాట్లాడుతు ఇక్కడ అవకాశాలు రాని విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని ఆయన చెప్పారు. అక్కడ కొన్ని ప్రత్యేక విద్యాసంస్థల్లో నేరుగా వెళ్లి ప్రవేశాలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి తెలంగాణలో విద్యను అభ్యసిస్తున్నారని ఉపోద్ఘాటించారు. తెలంగాణలో నాణ్యమైన విద్యను అందిచడం వల్లనే ఇతర రాష్ట్రాలనుంచి విద్యార్థులు వస్తున్నారని  మంత్రి కడియం తెలిపారు.