Home తాజా వార్తలు వరంగల్‌ను విద్యాసంస్థల హబ్‌గా మారుస్తాం: కడియం

వరంగల్‌ను విద్యాసంస్థల హబ్‌గా మారుస్తాం: కడియం

kadiyamహైదరాబాద్: వరంగల్‌ను విద్యాసంస్థల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మాట్లాడిన ఆయన… వరంగల్‌కు వెటర్నరీ కాలేజీతోపాటు సైనిక్ పాఠశాల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇప్పటికే జిల్లాలో 4 ఎస్‌సి రెసిడెన్షియల్ కాలేజీలను ప్రారంభించినట్లు తెలిపారు. 2016-17లో అగ్రికల్చర్ కాలేజీని కూడా ప్రారంభించనున్నామన్నారు. వరంగల్‌కు అత్యధిక విద్యా సంస్థలను ప్రకటించిన సందర్భంగా ఎంఎల్‌ఎ ఆరూరి రమేష్ సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.