Home మహబూబ్‌నగర్ ఎసిబి వలలో అవినీతి చేప

ఎసిబి వలలో అవినీతి చేప

Deputy Tahsildar Krishna Mohan Caught by ACB Raids

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ ప్రతినిధి : రేషన్ డీలర్ల నుంచి లక్ష రూపాయాలు లంచం తీసుకుంటూ పౌరసరఫరా శాఖ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిఫ్యూటి తహసిల్దార్ గా పనిచేస్తున్న ఓ డిఫ్యూటి తహసిల్దార్ అవినీతి నిరోదకశాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన వైనం శనివారం చోటు చేసుకుంది. అవినీతి నిరోదకశాఖ డిఎస్‌పీ కృష్ణగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం కోస్గి డిఫ్యూటి తహసిల్దార్‌గా పనిచేస్తున్న కృష్ణమోహన్ డిఫ్యూటేషన్‌పై పౌరసరఫరాలశాఖ విజిలెన్స్ అం డ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిఫ్యూటి తహసిల్దార్‌గా పనిచేస్తున్నా రు. ఇలా కోస్గి,మద్దురు,దామరగిద్ద,గండీడ్ మండల్లాలకు ఇంచా ర్జీగా వ్యవహరిస్తున్నారు. కాగా గండీడ్ మండలంలో 46 చౌక ధర డీలరు షాపులు ఉన్నాయి. వాటికి సంబంధించి గత నెల లో కృష్ణమోహన్ తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలిం చారు. వాటిలో 34 దుకాణాల్లో లెక్కలు తేడాగా ఉన్నట్లు అను మానం వ్యక్తం చేశారు. అదేక్రమంలో ఈ దుకాణాల్లో 266 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టినట్లు అంచనా వేశారు. వచ్చిందే అవకాశంగా భావించి డీలర్లతో బేరసారాలకు దిగా డు.

మొదట గండీడ్ మండల రేషన్ డీలర్ల సంఘం నాయకు డు రఘును సంప్రదించి గండీడ్ మండలంలో 266 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టాయని ఒక్కో క్వింటాకు రూ.3వేల చొప్పున రూ.7లక్షలు చెల్లించాలని, అలా చేసినట్లు అయితే రిపోర్టును ఉన్నతాధికారులకు పంపించకుండా ఆపుతానని సూచించాడు. దీంతో రఘు ఈ డిమాండ్‌కు ఒప్పుకోకుండా వెనుతిరిగాడు . రఘు ముందుకు రాకపోవడంతో డీటీ కృష్ణ మోహన్ తిరిగి అదే మండలానికి చెందిన డీలర్ల సంఘం కార్య దర్శి లక్ష్మయ్యను సంప్రదించి రూ.5లక్షలు ఇవ్వాలని డి మాండ్ చేశాడు. దీంతో డీటీ కృష్ణమోహన్‌కు లక్ష్మయ్య రూ. 5లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. దీంతో అడ్వన్స్‌గా లక్ష రూపాయాలు ఇస్తానని చెప్పడంతో శనివారం ఉదయం తన ఇంటికి రావాల్సిందిగా డీటీ కృష్ణమోహన్ సూచించాడు. దీం తో లక్ష్మయ్య లక్ష రూపాయాల లంచం ఇస్తుండగా ఏసీబి అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం డీటీ కృష్ణమోహన్ ఇంటిలో ఏసీబీ అధికారులు క్షుణంగా సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో డీటీ ఆస్తులపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. సోదాలు పూర్తి అయిన తరువాత డీటీ కృష్ణ మోహన్‌ను రిమాండ్‌కు తరలిస్తామని ఏసీబీ డిఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు.
లక్ష్మయ్య ఫిర్యాదుతో వెలుగులోకి…
డీలర్లకు అనుకూలంగా రిపోర్టు రాసేందుకు డబ్బులు ఇవా ల్సిందిగా లక్షల్లో డిమాండ్ చేయ డంతో రేషన్‌డీలర్లు సంఘం నేతలు నేరుగా ఎసి బిని సంప్రదించడంతో ఈ అవినీతి తతం గం వెలుగులోకి వచ్చింది. డీటీ కృష్ణమో హన్ వ్యవహా రంపై రేషన్‌డీలర్ల సంఘం కార్యదర్శి లక్ష్మయ్య ఈనెల 30న ఎసి బి డిఎస్‌పి కృష్ణగౌడ్‌ను సంప్రదించి ల క్ష్మయ్య ఫిర్యాదు చేశారు. దీంతో రం గంలోకి దిగిన ఎసిబి అధికారు లు వల పన్ని పట్టుకున్నారు. అనం తరం ఆయన ఇంటిలో క్షుణంగా తనిఖీలు నిర్వహిం చారు.