Home రాజన్న సిరిసిల్ల సరికొత్త పథకాల రూపకల్పన

సరికొత్త పథకాల రూపకల్పన

Design of new schemes

మనతెలంగాణ/సిరిసిల్ల: ప్రజల ఆకాంక్షలకు అనుగుణం గా ప్రభుత్వం సరికొత్త పథకాలు ప్రవేశపెడుతోందని ఐటి, పురపాలక, పట్టణాభివృధ్ధి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం తెలంగాణ రా ష్ట్ర నాలుగో ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీ య పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం వేదికపైనుండి ప్ర జలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తెలంగాణ సాధనోద్యమంలో తమ ప్రాణాలు ధారపోసిన ఎందరో అమరవీరులకు మంత్రి కెటిఆర్ తొలుత నివాళులు అర్పించారు. అ నంతరం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ కాలంలోనే కా దు నేడు కూడా తెలంగాణ పురోగమనాన్ని అడ్డుకోవాలని ప్రతిఘాతక శక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు. ప్రజల ఆ కాంక్షలకు అనుగుణంగా బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడటమే తమ లక్షమన్నారు. యావద్భారత దేశానికి తెలంగాణను, రాజన్న సిరిసిల్ల జిల్లాను దిక్సూచిగా నిలుపుదామని, అందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చా రు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాల్లో నిర్లక్షానికి గురైన ఆ ర్థిక వ్యవస్థను చక్కదిద్ధి, తెలంగాణ గత వైభవాన్ని పునరుద్ధరించే బాధ్యతను స్వీకరించి తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాలతో దేశం దృష్టిని తమవైపుకు తిప్పుకున్నామన్నారు.రాష్ట్రం వలస బతుకుల నుండి వ్యవసాయం వైపు, ప్రగతి వైపు తమ ప్రభుత్వం నడిపిస్తోందన్నారు. రా ష్ట్రంలో వివిధ పథకాలను దేశం దృష్టిని ఆకర్షించాయన్నా రు. మహారాష్ట్రలోని 40గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని,వివిధ రాష్ట్రాల్లోని ప్రజలు తెలంగాణ మా దిరిగా పథకాలు అమలు చేయాలని ఆయా ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారన్నారు.ప్రణాళికాబద్దమైన విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ వల్ల తెలంగాణ సిఎం నాయకత్వంలో అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుందన్నారు. తెలంగాణలో 58లక్షల మంది రైతులకు 12000 కోట్ల రూపాయలను పంట సహాయ ంగా అందించేందుకు రైతు బంధు అమలు చే స్తున్నామన్నారు.రాష్ట్రంలో 35,29,000 మం ది రైతులకు 16.12 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం మాఫీ చేసిన విషయాన్ని గుర్తు చే శారు.24గంటలు రైతులకు ఉచిత కరెంట్ ఇ వ్వడం ఒక చరిత్ర అన్నారు.రైతుల కోసం 5 లక్షల రూపాయల ఉచిత బీమా పథకాన్ని వ చ్చే ఆగస్ట్ 15వ తేదీ నుండి అమలు చేయనున్నట్లు తెలిపారు. పంట నిల్వల కోసం పెద్ద ఎత్తున గోదాములను నిర్మాణం చేశామని అ న్నారు. నూతన రిజిస్ట్రేషన్ విధానం ద్వారా అ వినీతి జాప్యానికి ఆస్కారం లేకుండా మండల కేంద్రాల్లోనే రిజిస్ట్రేషన్లు జరిగేలా తహసీల్దార్లకు అధికారాలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. రో డ్లను, పట్టణాల సుందరీకరణను కొనసాగిస్తున్నామన్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చి పంచాయతీలను క్రియాశీలకంగా మారుస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఏ రమేశ్,టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రా వు,జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, జెసి యాస్మిన్ భాష,డిఆర్‌ఓశ్యాంప్రసాద్‌లాల్, ఎస్‌పి రాహు ల్ హెగ్డె, మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పా వని, ఆర్‌డిఓ పాండురంగ, మున్సిపల్ కమిషనర్ డా.కెవి రమణాచారి, డిపిఆర్‌ఓ మామిండ్ల దశరథం, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.జాతీయపతాకావిష్కరణకు ముందు మంత్రి కెటిఆర్ సిరిసిల్లలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళ్లు అర్పించారు. అనంతరం ప్రసంగించిన మంత్రి వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారికి అవార్డులు, లబ్ధిదారులకు సుమారు 66కోట్ల రూపాయల ఆస్థులు అందించారు. అనంతరం కలెక్టరేట్‌లో జనహిత, మానేరు నదివద్ద జంక్షన్‌ను, బైపాస్‌రోడ్‌లో ఎంఎల్‌ఏ క్యాంపు కార్యాలయాన్ని మంత్రి కేటిఆర్ ప్రారంభించారు.