Home స్కోర్ బ్యాటింగే ఓడించింది!

బ్యాటింగే ఓడించింది!

Despite a win in the first Test, India lost to England

చెత్త షాట్లకు ప్రయత్నించి పెవిలియన్ బాటపట్టిన ఓపెనర్లు
అదుకోలేకపోయిన మిడిలార్డర్                                                                                                                                  బౌలర్ల ప్రతిభ అమోఘం

మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో గెలిచే పరిస్థితి ఉన్నా టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యమేనని చెప్పాలి. కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓటమి పాలు కావాల్సి వచ్చిందని ఆరోపించాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత్ 194 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సైతం ఛేదించక పోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ భారత బ్యాట్స్‌మెన్ నిరాశ పరిచారు. ఓపెనర్లు మురళీ విజయ్‌శిఖర్ ధావన్‌లు రెండు ఇన్నింగ్స్‌లలోనూ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. తొలి ఇన్నింగ్స్‌లో కాస్త మెరుగ్గా ఆడిన ఓపెనర్లు మురళీ విజయ్, శిఖర్ ధావన్‌లు రెండో ఇన్నింగ్స్‌లో చేతులెత్తేశారు. పుజారా స్థానంలో జట్టులోకి వచ్చిన శిఖర్ ధావన్ నిరాశ పరిచాడు.

పుజారాను కాదని ధావన్‌ను ఎంపిక చేయడంపై పెద్ద వివాదమే తలెత్తింది. కోహ్లి తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టడంలో ధావన్ విఫలమయ్యాడు. విజయ్ కూడా చెత్త ఆటతో విమర్శల పాలయ్యాడు. జట్టుకు ప్రధాన ఆయుధంగా మారుతాడని భావించిన విజయ్ పేలవమైన బ్యాటింగ్‌తో అంచనాలను తారుమారు చేశాడు. ఇంగ్లండ్ గడ్డపై మంచి రికార్డు కలిగిన విజయ్ ఈసారి ఆడిన మొదటి మ్యాచ్‌లోనే వైఫల్యం చవిచూశాడు. జట్టు ఓటమికి విజయ్ వైఫల్యం కూడా ఓ ప్రధాన కారణంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఫాస్ట్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొనే సత్తా కలిగిన విజయ్ రెండో ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు కనీసం 50 పరుగులు జోడించినా జట్టు కచ్చితంగా విజయం సాధించి ఉండేదని చెప్పొచ్చు.

రహానె కూడా…

ఇక, జట్టుకు ప్రధాన అస్త్రంగా పరిగణిస్తున్న స్టార్ ఆటగాడు అజింక్య రహానె తొలి టెస్టులో ఘోర వైఫల్యం చవిచూశాడు. ఫాస్ట్ పిచ్‌లపై మెరుగ్గా ఆడే ఆటగాడిగా పేరున్న రహానె రెండు ఇన్నింగ్స్‌లలోనూ చేతులెత్తేశాడు. అతని వైఫల్యం జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. టెస్టుల్లో నిలకడగా రాణించే ఆటగాళ్లలో రహానె ఒకడని చెప్పాలి. కానీ, తొలి మ్యాచ్‌లో రహానె విఫలమయ్యాడు. అతనిపై భారీ ఆశలు పెట్టుకున్న కోహ్లికి నిరాశే మిగిలింది. అతను రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 17 పరుగులే చేశాడు. దీన్ని బట్టి రహానె బ్యాటింగ్ ఎంత తీసికట్టుగా సాగిందో ఊహించు కోవచ్చు. పుజారా లేని పరిస్థితుల్లో జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న రహానె మెరుగ్గా ఆడాల్సింది. కానీ, రహానె తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టలేదు. చెత్త బ్యాటింగ్‌తో నిరాశే మిగిల్చాడు. రహానె కనీసం ఒక్క ఇన్నింగ్స్‌లోనైనా భారీ స్కోరు సాధించి ఉంటే మ్యాచ్ ఫలితం వేరే విధంగా ఉండేదేమో. విదేశి గడ్డపై జరిగే ప్రతి సిరీస్‌లో రహానె జట్టుకు కీలకమైన ఆటగాడు అనే విషయం తెలిసిందే. కనీసం రానున్న మ్యాచుల్లోనైనా రహానె తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. అతను రాణిస్తేనే భారత్‌కు మెరుగైన అవకాశాలుంటాయి.

ఒకే ఒక్కడు ఒంటరి పోరాటం..
ప్రతిష్టాత్మ బర్మింగ్‌హామ్ టెస్టులో ఓపెనర్లిద్దరూ తడబడి తప్పుడు షాట్లకు ప్రయత్నించడంతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి మొదటి ఇన్నింగ్స్‌లో 149 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. అతను చేసిన ఈ పరుగులు జట్టు మొత్తం చేసిన నరుగుల్లో సగం. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పొయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును అచితూచి అడుతూ పదునైన షాట్లతో 51 పరుగులతో జట్టును గెలిపించేందుకు తీవ్ర ప్రయత్నం చేశాడు. గెలుపునకు 53 పురుగుల దూరంలో కోహ్లి ఔట్ అయ్యాడు. కాగా విరాట్ తనదైన శైలిలో తనవంతు పాత్రను సోషించాడని, కెప్టెన్‌గా బాధ్యతగా ఆడాడని కొందరూ మాజీలు ప్రశంసిస్తున్నారు..

పుజారా లేక పోవడం దెబ్బతీసింది..
ధోని సారధ్యంలో ఇంగ్లండ్‌లో పర్యటించిన భా రత జట్టులో స్టార్ బ్యాట్స్‌మెన్ పుజారా అక్కడి పి చ్‌లపై రాణించిన అనుభవం ఉన్నా అతడిని తుది జట్టులోకి ఎంపిక చేయకపోవడం కూడా ఈ ఓటమికి ఓ కారణమే అని చెప్పొచ్చు. అనుభవం గల ఆటగాడిని పక్కనబెట్టి కెఎల్ రాహుల్, ధవన్‌లను ఆడించడం వారు ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొలేక చేతు లెత్తేయడంపై మాజీలు, క్రికెట్ అభిమానులు కోహ్లిపై గుర్రగా ఉన్నారు. అంతేగాక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలు కావడం కూడా అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిందనే ట్విట ర్ వేదికగా కోహ్లిపై పెట్టిన ట్వీట్లను గమనిస్తే అర్ధమవుతుంది. పుజారా స్థానంలో జట్టులోకి వచ్చిన ధావన్, రా హుల్‌లు ఇలా చేతులెత్తేయడం భారత్‌కు సమస్యగా మా రింది. వీరిద్దరిలో ఏ ఒక్కరూ రాణించినా జట్టుకు ప్రయోజనంగా ఉండేది. కానీ వీరు వైఫల్యం చవిచూడడం జట్టు ను వెంటాడింది. రానున్న మ్యాచుల్లో ధావన్‌కు చో టు దక్కుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల్లో పుజారాను జట్టులోకి తీసుకోవడం ఖాయం

చేతులెత్తేసిన రాహుల్..

ఇక, తుది జట్టులో చోటు సంపాదించిన లోకేష్ రాహుల్ కూడా నిరాశ పరిచాడు. రెం డు ఇన్నింగ్స్‌లలోనూ తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. అతని వైఫల్యం జట్టుకు సంకటంగా మారింది. భారీ ఆశలతో తుది జట్టుకు ఎంపిక చేస్తే రాహుల్ చెత్త బ్యాటింగ్ అంచనాలను తారుమారు చేశాడు. అతనిపై కెప్టెన్ ఉంచిన నమ్మకం నీరు గారింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లలో రాహుల్ ఒకడని చెప్పాలి. కానీ, తొలి టెస్టులో అతన్ని ఓపెనర్‌గా దించక పోవడం పెద్ద పొరపాటుగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ధావన్‌కు బ దులు రాహుల్‌ను ఓపెనర్‌గా పంపించి ఉంటే మ్యాచ్‌లో భా రత్‌కు పైచేయిగా ఉండేదని పలువురు మాజీలలు పేర్కొంటున్నారు.

బౌలర్ల శ్రమ వృథా..
తుది జట్టులో చోటు సంపాదించిన బౌలర్లందరూ ప్రత ్యర్థి బౌలర్లకన్నా దీటుగా రాణించి, ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. బర్మింగ్‌హామ్‌లో జిరగిన టెస్టులో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌన్సి పిచ్‌లపై కూడా రాణించి 4/62, 3/59తో వి ఆంగ్లేయులను తక్కువ స్కోరుకే ఔట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేగాకుండా పేసర్ల త్రయం కూడా అక్కడి బౌన్సి పిచ్‌లను వారికి అనుకూలంగా మా ర్చుకొని, లైన్ అండ్ లెగ్త్‌తో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు, మహ్మద్ షమి ౩ వికెట్లు, ఇషాంత్ శర్మ 6 వికెట్లు పడగొట్లారు. హార్దిక్ పాండ్య సైతం వారికి తోడుగా నిలిచినా బ్యాట్స్‌మెన్లు వారి శ్రమను వృథా చేశారు.