Home రంగారెడ్డి జనం వచ్చినా.. బడా నేతల డుమ్మా

జనం వచ్చినా.. బడా నేతల డుమ్మా

CONGRESS-3

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : పెద్ద నోట్ల రద్దును నిరసిస్తు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు నిర్వహించిన ధర్నాకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నేతలు, నాయకులు, ప్రజలు తరలివచ్చిన జిల్లా లోని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు మాత్రం ముఖం చాటేశారు. ఎఐసిసి పిలుపుతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని నేతలు సమ న్వయంతో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు నిర్వహించే ధర్నాకు హాజరు కావాలని నిర్ణయించిన జిల్లా నేతల మధ్య సయోద్య లేకపోవడంతో ఆపరేషన్ సక్సెస్ పేషేంట్ డైడ్ అన్న మాదిరి గా సభ ముగిసింది.

పెద్ద ఎత్తున జనం తరలివచ్చిన మాజీ మంత్రులు గడ్డం ప్రసాద్‌కుమార్, ఎ.చంద్రశేఖర్ మాజీ ఎమ్మెల్యేలు సుదీర్ రెడ్డి, కిచ్చనగారి లకా్ష్మరెడ్డిలు ముఖం చాటేశారు. మాజీ మంత్రి సబితారెడ్డి అన్ని తానై జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి నాయకులను కార్యక ర్తలను దర్నాకు తరలించడంలో సఫలం అయ్యారు. చెవెళ్ల, మహే శ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు తరలిరాగా కొంత మంది నియోజకవర్గ ఇంచార్జీలు తాము మాత్రమే వచ్చారు తప్ప ఇతర నాయకులను కార్యకర్తలను సమీక రించిన దాఖలాలు లేవు. వికారా బాద్, మేడ్చల్ నియోజక వర్గాల నుం చి నేతలు సైతం దర్నాకు దూరంగానే ఉన్నారు. జిల్లాలో ఎకైక శాసనస భ్యుడు రామ్మోహన్ రెడ్డి, శాసన మండ లి సభ్యుడు మాగం రంగారెడ్డిలు సైతం దర్నా కార్యక్రమం వైపు చూడలేదు.
కేంద్ర మంత్రి మాట్లాడుతుంటే…
కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారా యణ శనివారం నాడు నిర్వ హించిన దర్నాలో మాట్లాడుతుండగానే అక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌తో పాటు ఆయన వెంట వచ్చిన నేతలు,కార్యకర్తలు వెళ్లిపోతుండటం తో సర్వే సత్యనారాయణ నేరుగా మైక్ లోనే నేనే మాట్లాడుతుంటే మాజీ ఎమ్మెల్యే తన కార్యకర్తలను తీసుకుని పోతు న్నాడు అనడంతో వారు తిరిగి వచ్చి నిల్చున్నారు.