Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

10 రోజుల్లోగా పంటల వివరాల సేకరణ

mdk1సంగారెడ్డి : జిల్లాలో పండించే పంటల వివరాలను 10 రోజుల్లోగా సమర్పించాలని జిల్లా జెసి వెంకట్రామ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంటల వివరాల సేకరణ, హద్దు లు, దిగుబడి వివరాల కోసం ఒక ప్రణాళికను రూపొందించుకుని ముందుకు సాగాలన్నారు. గ్రామ రెవెన్యూ అధికారుల ద్వారా ఈ వివరాలను సేకరించాలన్నారు. తహసీల్దార్లు రోజుకు రెండు గ్రామాలను సందర్శించాలని, దీనికి గాను గ్రామాల్లో ముందుగానే టాంటాం వేయిం చాలన్నారు. మీ -సేవ కేంద్రాల ద్వారా పారదర్శక సేవలు అందించడానికి గాను వారితో తరచుగా సమావేశాలు నిర్వహించాలన్నారు. ఇజిఎస్ కింద చేపట్టే పనులు ప్రజలకు ఉపయోగపడే వి ధంగా ఉండాలని, ఆయన ఎంపిడిఓలకు సూచించారు. పనులను గుర్తించి వెంటనే మంజూరు చేసి చేపట్టాలని పేర్కొన్నారు. ఎస్‌సి కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపా ధి పథకం కింద దరఖాస్తు చేసుకుని ఎంపి కైన లబ్ధిదారులకు బ్యాంకు అకౌంట్లు లేని వారికి ఈ నెల 30లోపుగా అకౌంట్లు తెరి పించాలన్నారు. స్వచ్ఛ భారత్ కింద నిర్మించే మరుగుదొడ్లకుగాను ప్రతి మం డలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించే విధంగా చర్యలు తీసుకోవా లన్నారు. డిఆర్‌డిఎ పిడి సత్యనారా యణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అందిస్తున్న ఆసరా పింఛన్లకు సంబంధించిన రికన్స ల్టేషన్ రిపోర్టులను వెంటనే సమర్పించా లని ఎంపిడిఓలను ఆదేశించారు. జెడిఎ హుక్యా నాయక్ మాట్లాడుతూ రబీ సీజన్ ప్రారంభ మవుతుందని, ఎలాంటి ఇబ్బం దులు ఎదురు కాకుండా అవసరమైన విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసుకోవాల ని వ్యవసాయ అధికారులను ఆదేశించా రు. డ్వామా పిడి సురేందర్ కరణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments

comments