Search
Friday 21 September 2018
  • :
  • :

అన్ని వర్శిటీలలో డిటెన్షన్!

Osmania-University-Hyderaba

హైదరాబాద్ : వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అమలులోకి రానుంది. డిటెన్షన్ విధానం ప్రస్తుత విద్యాసంవత్సరమే అమలులోకి రాగా మూడు వర్సిటీలు మాత్రమే అమలు చేశాయి. మరో మూడు వర్సిటీలు పాత విధానాన్నే కొనసాగిస్తున్నాయి. దాంతో విద్యార్థుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇటీవల ఉన్నత విద్యామండలి ఛైర్మన్ అధ్యక్షతన జరిగిన వైస్ ఛాన్స్‌లర్ల సమావేశంలో డిగ్రీ కళాశాలల ప్రవేశాలు, సిబిసిఎస్ విధానం, డిటెన్షన్ అమలుపై చర్చించారు. సకాలంలో డిగ్రీ ప్రవేశాలు పూర్తి చేసి, అన్ని వర్సిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో జూలై 2 నుంచి తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ(దోస్త్) ద్వారానే ప్రవేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని వర్సిటీలలో ఒకే విధానం చేస్తేనే బాగుంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని వర్సిటీల పరిధిలో డిగ్రీ కళాశాలల్లో డిటెన్షన్ విధానం అమలు కానుంది. ఈ ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ, శాతవాహన, పాలమూరు వర్సిటీలు మాత్రం డిటెన్షన్ విధానాన్ని చేయగా, అందులో ఒయు పరిధిలో 4,650 మంది డిటెయిండ్, శాతవాహన వర్సిటీ పరిధిలో 2,300 మంది డిటెయిండ్, పాలమూరు వర్సిటీ పరిధిలో 3,200 మంది విద్యార్థులు డిటెయిండ్ అయ్యారు. కాకతీయ, మహాత్మగాంధీ, తెలంగాణ యూనివర్సిటీలలో మాత్రం డిటెన్షన్ విధానం అమలు చేయలేదు.

అన్ని డిగ్రీ కోర్సుల్లో అమలవుతున్న డిటెన్షన్
వృత్తి విద్యా కోర్సులైన ఇంజనీరింగ్, బి.ఫార్మసీ వంటి యుజి కోర్సులతో ఎం.టెక్,ఎం.ఫార్మసీ, ఎంబిఎ, ఎంసిఎ వంటి పిజి కోర్సుల్లో గత కొన్నేళ్లుగా డిటెన్షన్ విధానం అమలవుతుండగా, ఈ ఏడాది నుంచి డిగ్రీ కోర్సుల్లో అమలులోకి వచ్చింది. ఇప్పటివరకు వృత్తి విద్యా కోర్సులకే పరిమితమైన డిటెన్షన్ విధానం ఇక నుంచి అన్ని రకాల డిగ్రీ కోర్సుల్లో అమలు కానుంది. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం(సిబిసిఎస్) విధానం అమలు చేయాలని యుజిసి ఆదేశాలిచ్చిన నేపథ్యంలో గత ఏడాది నుంచి ఇయర్ విధానానికి బదులుగా సెమిష్టర్ విధానం అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే డిగ్రీలో డిటెన్షన్ విధానం తీసుకువచ్చారు.

Comments

comments