Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

దేవాదుల మూడో దశ, మల్కాపూర్ పనులు 2019 జూన్ నాటికి పూర్తి

kadiyam
= 365 రోజులు నీటిని లిఫ్ట్ చేసే విధంగా తుపాకుల గూడెం వద్ద బ్యారేజీ నిర్మాణం
= మల్కాపూర్ రిజర్వాయర్ పూర్తయితే స్టేషన్ ఘన్‌పూర్ కరువు, వలసలు తగ్గుతాయి

= వచ్చే జూన్ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్‌లో డిగ్రీ కాలేజీ ప్రారంభిస్తాం
= స్టేషన్‌ఘన్‌పూర్ ప్రజల రుణం తీర్చుకునేందుకు పని చేస్తున్నాను
= ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాగునీరు, సాగునీరు సమస్యను శాశ్వతంగా పరిష్కరించే విధంగా దేవాదుల మూడో దశ పనులు, తుపాకులగూడెం వద్ద బ్యారేజీ పనులు వేగంగా జరుగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. 2019 జూన్ నాటికి వీటిని పూర్తి చేసేలా పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ మండలం, రాజవరం గ్రామంలో పగాల సంపత్‌రెడ్డి తల్లి మృతి చెందిన సందర్భంగా కుటు ంబ సభ్యులను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పరామర్శించారు.
ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. నాడు భారీ నీటిపారుదల శాఖా మంత్రి గా దేవాదులకు రూపకల్పన చేసి మొదటి దశ పనులు ప్రారంభించడం జరిగిందని, దేవాదుల మొదటి, రెండో దశ పనులు పూర్తయి మూడో దశ పనులు వేగంగా జరుగుతున్నాయని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.
సవరించిన అంచనాల ప్రకారం దేవాదులకు రూ.13,400 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశామని, ఇందులో ఇప్పటికే రూ.9400 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. జూన్ 2019 వరకు మొదటి, రెండో, మూడో దశ పనులు పూర్తి చేయాలని సంకల్పించామని చెప్పారు. గోదావరి నది నుంచి 365 రోజులు నీటిని లిఫ్ట్ చేసే విధంగా తుపాకుల గూడెం వద్ద రూ.2100 కోట్ల బ్యారేజీ నిర్మాణం జరుగుతుందని, దీనిని 2019 వరకు పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ రెండింటి పనులు పూర్తయితే మొదటి దశలో రెండు మోటార్లు, రెండో దశలో రెండు మోటార్లు, మూడో దశలో ఆరు మోటార్లు ఉపయోగించి మొత్తం పది పంపులతో దాదాపు 270 రోజులు గోదావరి మంచినీటిని లిఫ్ట్ చేసి 60 టిఎంసిలను వ్యవసాయానికి ఉపయోగించుకునే వీలుందన్నారు.
మల్కాపూర్ రిజర్వాయర్ నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్‌కు నేరుగా 90 రోజుల పాటు 10.7 టిఎంసిలు నింపే విధంగా లిఫ్టులు ఏర్పా టు చేస్తున్నామని చెప్పారు. మల్కాపూర్ రిజర్వాయర్ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్, అశ్వరావుపల్లి రిజర్వాయర్‌కు నీటిని తీసుకోవచ్చని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.
ఎత్తయిన ప్రదేశంలో మల్కాపూర్ రిజర్వాయర్ కడుతుండడం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాకు తాగునీరు, సాగునీరు సమస్య శాశ్వతంగా తీరుతుందని చెప్పారు. వరంగల్‌లో పెద్ద రిజర్వాయర్లు లేవని దేవాదులలో భాగంగా మాకొ క రిజర్వాయర్ కావాలని అడిగినప్పుడు మల్కాపూర్ రిజర్వాయర్‌కు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిపాదనలు సిద్ధం చేయించారని చెప్పారు.
ఇదే అంశాన్ని సోమవారం కరీంనగర్ సభలో కడియం శ్రీహరి ప్రతిపాదనల మేరకు మల్కాపూర్ రిజర్వాయర్ ఇచ్చామని చెప్పారని తెలిపారు. మల్కాపూర్ రిజర్వాయర్‌కు సహకరించాలని లింగంపల్లి గ్రామాలకు, మల్కాపూర్ రిజర్వాయర్ కింద ఉన్న ఇతర గ్రామస్తులను కోరుతున్నానని చెప్పారు.
నాడు దేవాదుల,
నేడు మల్కాపూర్‌లకు శ్రీకారం
నాడు దేవాదుల అన్నప్పుడు కడియం శ్రీహరి రాజకీయాల కోసం దేవాదుల అంటున్నారని చెప్పారు. కాని నేడు అన్నింటికి అదే ముఖ్యమైందని, అదేవిధంగా మల్కాపూర్ రిజర్వాయర్ పూర్తయితే స్టేషన్‌ఘన్‌పూర్‌లో కరువు, వలసలు ఉండవని స్పష్టం చేశారు. దీంతో రాజకీయంగా నాకు జన్మనిచ్చిన స్టేషన్‌ఘన్‌పూర్ ప్రజల రుణం తీర్చుకోవాలనే నాడు దేవాదుల, నేడు మల్కాపూర్‌లకు శ్రీకారం చుట్టానన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ కావాలని అడుగుతున్నందున 2018-19 జూలై నుంచి ప్రారంభమయ్యే విధంగా కాలేజీని మంజూరి చేస్తున్నామని ప్రకటించారు. నాడు, నేడు నియోజకవర్గం కోసం దృష్టి పెట్టి పనిచేశానని, వచ్చే రోజుల్లో కూడా మల్కాపురం రిజర్వాయర్, ఘన్‌పూర్‌లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Comments

comments