Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

శర్వానంద్‌తో దేవాకట్టా చిత్రం

devakattaరెండే రెండు సినిమాలతో టాలీవుడ్ దర్శకుల జాబితాలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించు కున్నాడు దేవాకట్టా. వెన్నెల, ప్రస్థానం చిత్రాలతో ప్రతిభావంతులైన దర్శకుల జాబితాలో అతను చేరిపోయాడు. ఆతర్వాత నాగచైతన్యతో చేసిన ‘ఆటోనగర్ సూర్య’ అట్టర్ ఫ్లాప్ కావడంతో పరిస్థితిలో మార్పొచ్చింది. ఇక ఓ కోలీవుడ్ హిట్ మూవీని ‘డైనమైట్’గా రీమేక్ చేసి మరోసారి నిరాశపరిచాడు. దీంతో దేవాకట్టాను ఎవరూ పట్టించుకోలేని పరిస్థితి వచ్చేసింది. కానీ తనకు టాలీవుడ్‌లో హీరోగా మంచి ఇమేజ్ అందించిన దేవాకట్టాకు సాయం చేసేందుకు శర్వానంద్ ముందుకొచ్చాడు. వెన్నెల, ప్రస్థానం చిత్రాలు శర్వా కెరీర్‌ను పూర్తిగా మార్చేశాయి. అందుకే ఇప్పుడు దేవాకట్టాతో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడట శర్వానంద్. ప్రస్తుతం వరుస హిట్స్‌తో జోరుమీదున్న అతను ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సినిమాకు శర్వా డేట్స్ కూడా కేటాయించాడట. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలోనే సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని  తెలిసింది.

Comments

comments