Home నిర్మల్ మెరుగైన రహదారులతోనే గ్రామాల అభివృద్ధి

మెరుగైన రహదారులతోనే గ్రామాల అభివృద్ధి

statue

మన తెలంగాణ/నిర్మల్‌అర్బన్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం రహదారులు, వంతెనల నిర్మాణాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం సోన్ మండల కేంద్రంలో రూ.2 కోట్ల 40 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సోన్-బొప్పారం బ్రిడ్జ్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రహదారులు, వంతెనలు ఉంటేనే గ్రామాలు అభివృద్ధిలో ఉందన్నట్లు కనబడుతుందన్నారు. దీనికి కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. జిల్లాలో 150 కి.మీ. మేరకు రహదారులు అభివృద్ధి పరచాలనే లక్షంతో ఇప్పటి వరకు 130 కి.మీ. రహదారులను అభివృద్ధి పరచడం జరిగిందన్నారు. అలాగే జిల్లాలో 37 వంతెనలు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అలాగే జిల్లాలో శుక్రవారం నిరంతర విద్యుత్‌ను అందజేయనున్నట్లు తెలిపారు. కెసిఆర్ కిట్‌తో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. నిర్మల్ ఏరియా ఆసుపత్రుల్లో రూ.12 కోట్లతో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే రైతులకు ఎకరానికి రూ.4వేలు అందిచనున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 15 వరకు ఎస్‌ఆర్‌ఎస్‌పి నుండి సరస్వతి కాలువ ద్వారా నిరందించడం జరుగుతుందని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌సిఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, టిఆర్‌ఎస్ కార్యదర్శి సత్యనారాయణగౌడ్, ఆర్‌డిఒ ప్రసునాంబ, సర్పంచ్ కిష్ణప్రసాద్ రెడ్డి, తహసీల్దార్ శివప్రసాద్, మొహినోద్దిన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.