Home తీర్పు-2018 ఎన్ని కూటములు వచ్చినా టిఆర్‌ఎస్ విజయం తధ్యం

ఎన్ని కూటములు వచ్చినా టిఆర్‌ఎస్ విజయం తధ్యం

Development of Toopran in TRS Government

మన తెలంగాణ/మనోహరాబాద్/తూప్రాన్ : కాంగ్రెస్ మహాకూటమి పేరుతో ప్రజలను మోసం చేయడానికే వస్తుంది. గత పాలకుల వైఫల్యంతో 60 ఏళ్ల నుండి చేసిందేమీలేదు. గ్రామాల్లో త్రాగడానికి నీళ్లులేక మహిళలు గెలిచిన ఎమ్మెల్యేలకు బిందెలు అడ్డం పెట్టి ధర్నాలు చేసిన విషయం తెలిసిందే. గజ్వేల్ నియోజవర్గం నుండి ఇప్పటివరకు 13 మంది ఎమ్మెల్యేలు గెలిచి నా అభివృద్ధి చేయలేకపోయారు. ఈ మధ్య కాలంలో రెండు గుంటనక్కలు గ్రామాలలో తిరుగుతున్నాయి. నర్సారెడ్డి ఎమ్మెల్యేగా ఉండి గ్రామాలలో సీసీ రోడ్డు వేయలేడు. ప్రతాప్‌రెడ్డి, నర్సారెడ్డిలు గుంటనక్కల వలె గ్రామాలలో తిరుగుతున్నారని యెద్దేవా చేశారు. చం ద్రబాబుది రెండకళ్ళ సిద్దాంతం, రాహుల్‌ది కన్నుకోట్టే సిద్దామని, టిఆర్‌ఎస్‌ది కంటికిరెప్పలా ప్రజలను కాపాడుకునే బాధ్యత అని ఆయన అన్నారు.

ఆంధ్రాబాబు తెలంగాణలో కూటమి పేరుతో ప్రజలను మోసం చేయడమే కాకుండా టిఆర్‌ఎస్ అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే పోత్తులకు దిగారని ఆయన యెద్దెవా చేశారు. మరోపక్క రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో క న్నుకోట్టే సిద్దాంతం ఎంచుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో పోరాటి సాధించుకున్న రాష్ట్రంలో 2014లో టిఆర్‌ఎస్ గెలిచి ప్రభుత్వం ఏర్పడి ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ అభివృద్ధి చేస్తుంది. కాంగ్రెస్‌కు ఓటువేస్తే అభివృద్ధి పథంలో ఉన్న రాష్ట్రాన్ని బ్రష్టుపట్టిస్తారని ఆరోపించారు. గజ్వేల్ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్ లక్ష మెజారిటితో గెలుస్తారన్నారు. తూప్రాన్ మండలంలోని లింగారెడ్డి గార్డెన్ నుండి రోడ్ నుండి నర్సాపూర్ చౌరస్తా తెలంగాణ వి గ్రహం మీదుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. హరీష్‌రావుకు మహిళలు బతుకమ్మలతో, బోనాలతో స్వాగతం పలికారు. ము దిరాజ్‌లు చాపలుపట్టే వలలతో డప్పుడోళ్ల చప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు.

ఇంటింటి ప్రచారంలో కేసీఆర్‌ని గెలిపించుకుందామని, అధిక మెజారిటి తెచ్చుకుందామని ప్రజలకు వివరించారు. మన పార్టీ టిఆర్‌ఎస్, మన సీఎం కేసీఆర్ అం టూ ఇంటింటి ప్రచారం చేశారు. పట్టణంలో సుభాష్‌చంద్రబోస్ విగ్రహం వద్ద ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ని లక్షకుపైగా మెజారిటితో గెలిపించుకుందామని, మన ఎ మ్మెల్యే సీఎం కావడం ఎంతో సంతోషకరమని అన్నా రు. టిఆర్‌ఎస్ పార్టీ మన ఇంటి పార్టీ అంటూ ఆయన ప్రజలకు తెలుపుతూ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చే స్తున్నారన్నారు. అనంతరం మంత్రి హరీష్‌రావు మా ట్లాడుతూ గతంలో గజ్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా గెలిచి వేలకోట్లు ఖర్చుచేశారే తప్పా ఎలాంటి అభివృద్ధి జరుగలేదని, సీఎం కేసీఆర్ నాలుగున్నర సంవత్సర కాలంలో 6వేల కోట్లతో గజ్వేల్‌ను అభివృద్ధి పథంలో తీసుకెళ్ళి ప్రపంచస్థాయిలో నిలిపారన్నారు. సంగారెడ్డి, తూప్రాన్, గజ్వేల్ మీదుగా భూవనగిరి వరకు ఎనిమిది లైన్లతో రిజినల్ రింగ్‌రోడ్డును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ రహదారికి పక్కన పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు కల్పించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. మనోహరాబాద్ నుండి గజ్వేల్ మీదుగా కొత్తపల్లి వరకు రైల్వేలైన్ పను లు చేపట్టిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పేదింటి ఆడబిడ్డ పెళ్ళిళ్ళ కోసం కళ్యాణల క్ష్మి, షాదీముభారక్ పథకాల ద్వారా లక్ష రూపాయలను అందిస్తున్నట్లు, రైతుబంధు, రైతుభీమా ద్వారా రైతులకు పెట్టుబడి సహాయంతో పాటు రైతుకుటుంబానికి ఇన్సూరెన్స్ అందిస్తున్నట్లు వివరించారు. కంటివెలుగు ద్వారా రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కంటిపరీక్షలు నిర్వహిస్తుందన్నారు. మనోహరాబాద్‌ను మండలంగా ఏర్పాటు చేసింది టిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆయనఅన్నారు. మళ్లీ ఆశీర్వదించి గెలిపిస్తే మెనిఫెస్టో ప్రకారం ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. గజ్వేల్ ని యోజకవర్గంలోని రైతులు పంటలు పండించిందేకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అందించబోతున్నట్లు తెలిపారు. తూప్రాన్ ఉమ్మడి మండలం సస్యశ్యామలమవుతుందన్నారు.

టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో తూప్రాన్‌ను అభివృద్ధి చేసి మున్సిపాలిటిగా ప్రకటించుకున్నామన్నారు. మళ్ళీ ఆశీర్వదించి కేసీఆర్‌ను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసిచూపిస్తామని ఆయన అ న్నారు. మమల్ని గెలిపిస్తే కంటికిరెప్పలా కాపాడుకుంటామని హరీష్‌రావు అన్నారు. ఈ కార్యక్రమంలో హౌ సింగ్ చైర్మేన్ భూంరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్‌గౌడ్, పిఎసీఎస్ చైర్మేన్ మహిపాల్‌రెడ్డి, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మేన్ శ్రీశైలంగౌడ్, బబుల్‌రెడ్డి, మనోహరాబాద్ మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ సుధాకర్‌రెడ్డి, ఎంపిటిసీ మెట్టు బాలక్రిష్ణ, చంద్రశేఖర్, కర్రె నాగభూషణం, కాళకల్ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు ఇంద్రసేనాయాదవ్ తదితరులున్నారు.

Development of Toopran in TRS Government

Telangana News