Saturday, April 20, 2024

గ్రామాల అభివృద్ధే సీఎం కేసీఆర్ ఆశయం

- Advertisement -
- Advertisement -

దండేపల్లి : గ్రామాలను అభివృద్ధ్ద్ది చేయడమే సీఎం కేసీఆర్ ఆశయమని, ఆ దిశలో ఎన్నో నిధులను కేటాయిస్తున్నాడని మంచిర్యాల ఎమ్మె ల్యే దివాకర్‌రావు అన్నారు. దండేపల్లి, గుడిరేవు గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు గురువారం ఆయన భూ మి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకొక్క భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 20 లక్షలను మంజూరు చేసిందని, నాణ్యత లోపం లేకుండా భవనాలను నిర్మించాలన్నారు. ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేనన్నారు. వికలాంగుల సంక్షేమం కోసం వచ్చే నెల నుండి పించన్‌లను రూ. 1000 అధనంగా అందించడం జరుగుతుంద న్నారు.

రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు భీమా పథకాలను ప్రవేశపెట్టి రెండు పంటలకు సాగు నీరు అందిస్తున్న ఘనత కే సీఆర్‌దేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కన్వీనర్ మోటపలుకుల గురువయ్య, సహకార సంఘం అద్యక్షులు కాసనగొట్టు లింగన్న, సర్పంచ్ బుక్య చంద్రకల, ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్, వైస్ ఎంపీపీ పసర్తి అనిల్, ఉప సర్పంచ్ భూమన్న, మా ర్కెట్ కమిటి వైస్ చైర్మన్ రేణి శ్రీనివాస్, బీఆర్‌ఎస్ పార్టీ మండల అద్యక్షుడు చుంచు శ్రీనివాస్, ఎంపీడీవో మల్లేషం, నాయకులు బండారి మల్లేష్, బొలిశెట్టి రమేష్, సత్యం, చీర్ల వెంకటేశ్వర్లు, బొలిశెట్టి సత్యం, శంకర్‌రావు, అల్లంల సంతోష్, గోల్ల రాజమల్లు, రాంచందర్, సత్యనారాయణ, బీమన్న, నరేష్, బొమ్మెన మహేష్, బొమ్మెన గంగధర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News