Home సూర్యాపేట కాంగ్రెస్‌తో అభివృద్ధి శూన్యం

కాంగ్రెస్‌తో అభివృద్ధి శూన్యం

trs

*60 ఎళ్లలో జరగని అభివృద్ధి
మూడేళ్లలో కనిపించింది
*ఉత్త మాటలకు విలువ లేదు
*జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి జగదీష్‌రెడ్డి

మన తెలంగాణ/సూర్యాపేట: 60 ఏండ్ల పాలనలో జరగని అభివృద్ధి మూడేళ్లలో సాధించిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి జి. జగదీష్‌రెడ్డి అన్నారు. నాటి పాలన వ్యవహార శైలి వల్లే దేశాభివృద్ధి వెనుకకు వెళ్లిందని చెప్పారు. మన దేశం తర్వాత స్వాతంత్య్రం పొందిన దేశాలైన సింగపూర్, మలేషియా లాంటి దేశాలు నేడు ప్రపంచానికే అభివృద్ధిలో సవాలు విసురుతున్నాయని ఉద్భోదించారు. కాంగ్రెస్‌పార్టీ వైఖరి వల్లే దేశం దౌర్భాగ్యస్థితికి చేరుకుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. గతంలో చేసిన తప్పునే మళ్లీ చేస్తున్నారని చెప్పారు. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్‌పాలనలో అభివృద్ధికి నోచుకోలేని గ్రామాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఈ గ్రామాలను గుర్తించిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకు వెళుతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ నోరును పారేసుకుంటున్నారని వాపోయారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని అభివృద్ధిలో కలిసివస్తే ప్రజలు స్వాగతిస్తారని ఉత్త (ఉత్తమ్ కుమార్‌రెడ్డి వ్యాఖ్యాలు) మాటలకు విలువకట్టాల్సిన అవసరంలేదని కొట్టి పారేశారు. ప్రజల వద్దకు వెళ్లలేకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో మైళ్లదూరం పాఠశాలకు నడిచివెళ్లిన విద్యార్థులు నేడు తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో భాగంగా వేసిన రోడ్డు మార్గంలో సుఖంగా వెళుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులకు 500 రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పడంతోపాటు నాణ్యమైన విద్యను అందిస్తుందని స్పష్టం చేశారు. త్వరలోనే ప్రతి తండాకు ఎల్‌ఈడీ బల్బ్‌లను అందజేయనున్నట్లు తెలిపారు. టిఆర్‌ఎస్ పట్టణ నాయకులు శనగాని రాంబాబుగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌ల ఆధ్వర్యంలో సుమారు 1000 మంది కార్యకర్తలను గురువారం మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి గులాబి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామెల్, నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘ చైర్మన్ గుత్తా జితేంధర్‌రెడ్డి, కోదాడ వ్యవసా య మార్కెట్ కమి టీ చైర్మన్ కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, ఎంపిపి ఒట్టె జాన య్య యాదవ్, నా యకులు కట్కూరి గన్నారెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, మొరిశెట్టి శ్రీనివాస్, గండూరి ప్రకాశ్, పల్స వెంకన్న తదితరులు పాల్గొన్నారు.