Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) డాష్ బోర్డుల సమాచార వినియోగం తప్పనిసరి

డాష్ బోర్డుల సమాచార వినియోగం తప్పనిసరి

Devlopments Medchal Municipal Deparments

మన తెలంగాణ/మేడ్చల్ జిల్లా: డాష్ బోర్డులలో వివిధ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని సాంకేతిక సహాయంతో సమర్ధవంతంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సచివాలయం నుంచి తెలంగాణ డాష్ బోర్డు, మున్సిపాలిటీలలో కార్పొరేషన్‌లు చేపడుతున్న అభివృద్ధ్ది పనులు, ఒడిఎఫ్ తదితర అంశాలపై సంబంధిత శాఖల కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో వివిధ శాఖల సిబ్బంది వద్ద అందుబాటులో ఉన్న ట్యాబులు, ఐపాడ్స్, సాప్ట్‌వేర్ సమస్యలపై బేసిక్ సర్వేను నిర్వహించాలని అన్నారు. గ్రామాలలో వ్యవసాయ, ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమం, బిసి సంక్షేమం, రెవెన్యూ పద్దతులపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ యంవి రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాలలో బయోమెట్రిక్, స్కాలర్ షిప్‌లు, ట్యాబ్‌ల ద్వారా సమాచారాన్ని సేకరించడం సంవత్సరం క్రితం ప్రారంభించామని తెలిపారు. ఏఎన్‌ఎం లకు 258 ట్యాబ్‌లు అవసరమవగా 35 మాత్రమే అందజేశామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌ఓ విజయకుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.