Search
Thursday 18 October 2018
  • :
  • :

ఘనంగా ముక్కోటి ఏకాదశి

God

రాయపర్తి : మండలంలోని వివిద గ్రామాలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈసందర్భంగా మహిళలు ఆదివారం తెల్లవారు జామునే లేచి తలంటూ స్థానాలు ఆచరించి మంగళహారతులతో గ్రామాలలోని వైష్ణవ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్శంగా రాయపర్తి మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి దేవాలయ అనువంశిక పూజారి ఆరుట్ల రంగాచార్యులు, రామక్రిష్ణమాచార్యులు, రమణాచార్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్గశిర పుష్య మాసాలలో ఉత్తరాయణ పుణ్యకాలం సందర్భంగా శ్రీమహావిష్ణువు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఇచ్చి ప్రజలకు సుఖసంతోషాలను ప్రసాదిస్తాడని, కాబట్టి ఈరోజున ముక్కోటి దేవతలు స్వామివారి దర్శనానికి విచ్చేస్తారని ప్రజలు పర్వదినంగా భావించి భగవంతుని కృపాకటాక్ష వీక్షణాలు తమపై కురిపించాలని పూజలు చేస్తారన్నారు. ఈకార్యక్రమంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ గోత్ర నామార్చనలతో పూజలు నిర్వహించారు.

ఎన్‌జిఒ కాలనీలో…

ముక్కోటి ఏకదశి పురస్కరించుకోని ఎన్‌జిఒస్‌కాలనిలోని శ్రీవెంటేశ్వర స్వామి దేవస్ధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముక్కోటి ఏకదశి వైష్టవ సాంప్రదాయం ప్రకారం శ్రీమహవిష్టువు నిద్రలో నుండి మె ల్కొంటారని ఆ సందర్భాన్ని పురస్కరించుకోని వైష్టవ దేవాలయంలో ప్రత్యేక పూజలు ఉదయం 4గంటల నుండి ప్రారంభామైతాయని దేవాలయ అర్చకులు డింగరి వాసుదేవ చార్యులు తెలిపారు. స్వామి వారికి ప్రత్యేక అర్చనలు చేయడం జరిగినది. ఉదయం నుండి అదిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.

Comments

comments