Home ఆదిలాబాద్ గోదావరి నదిలో భక్తుల పుణ్యస్నానాలు

గోదావరి నదిలో భక్తుల పుణ్యస్నానాలు

Godavari-riverఆదిలాబాద్: దండేపల్లి మండలంలోని గూడెం సమీపంలో గోదావరి నదిలో శుక్రవారం వందలాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. స్నాన గట్టాల వద్ద నీటి మట్టం పెరగడం వలన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, గంగమ్మ తల్లి పూజలు చేసుకున్నారు. గోదావరి స్నానాలు ఆచరించిన భక్తులు సత్యనారాయణ స్వామి దేవాలయం సందర్శించి, స్వామివారి దర్శనం చేసుకున్నారు. అలాంగే శనీశ్వర, సాయిబాబా, ఆప్పయ్య ఆలయాలను భక్తులు సందర్శించి మొక్కలు తీర్చుకున్నారు.