Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

టికెట్ల కోటా పెంచుతారా..లేదా?

Devotees  facing trouble in Thirumala Temple

మనతెలంగాణ / తిరుమల ప్రతినిధి:   తెలుసుకుని వారికి మెరుగైన సౌకర్యాలకై పాటు పడాల్సిన టిటిడి బోర్డు సభ్యులు దాన్ని పక్కనబెట్టి ఏకంగా తమ వ్యక్తి ప్రయోజనాలకోసం సమావేశంలో పట్టుపట్టడం చర్చనీయాంశంగా మారిం ది. తాజాగా జరిగిన పాలకమండలి సమావేశంలో  తమ సిఫార్సు లేఖలకు రోజువారీగా మంజూరుచేస్తున్న బ్రేక్ దర్శనం టిక్కెట్ల కోటా పెంచుతారా లేదా అంటూ ఐఏఎస్ అధికారి అయిన తిరుమల జెయిఓ శ్రీనివాసరాజుపై బోర్డు సభ్యులైన సండ్ర వెంకటవీరయ్య, బోండా ఉమామహేశ్వరరావు  తీవ్రస్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం దుమారం చెలరేగింది. దీనిపై జెయిఓ శ్రీనివాసరాజు వివరణ ఇవ్వడానికి ప్రయత్నించగా సభ్యులు శాంతించక పోవడంతో అలిగిన ఆయన సమావేశం నుండి అర్దాంతరంగా వెలుపలకు వెళ్ళిపోయారు. చైర్మన్ పుట్టాసుదాకర్ యాదవ్ సమక్షంలోనే ఈరగడ అంతాజరిగింది. తమప్రాంతాలనుండీ అనేకమంది దర్శనం టిక్కెట్లకోసం తాము తీవ్ర ఒత్తిడి ఎదుర్కుంటున్నామని, అయితే తామిచ్చే సిపార్సులేఖలను తిరుమల జెయిఓ కార్యాలయం సిబ్బంది అసలు పట్టించుకోవడం లేదని సభ్యులు చైర్మన్ ఎదుట వాపోయారు. అంతేకాకుండా పాలకమండలి సభ్యులైన తమ ఫోన్లు కూడా జెయిఓ రిసీవ్ చేసుకోకుండా నిర్లక్షంగా వ్యవహరించడం ఎంతవరకూ సబబు అంటూ చైర్మన్‌ను సండ్రవెంకటవీరయ్య, బోండా ఉమామహేశ్వర రావులు ప్రశ్నించారు. దీనిపై చైర్మన్ సభ్యులను శాంతపరుస్తూ మనమంతా నూతనంగా నియమింపబడిన పాలకమండలి సభ్యులమని, అందరికీ ఆదర్శంగా ఉండాలని సూచించారు. అయితే వాస్తవానికి ఇప్పటిదాకా పాలకమండలి సభ్యుల సిపార్సులేఖలపై తిరుమలలో ప్రతినిత్యం 35 బ్రేక్‌దర్శనం టిక్కెట్లు జారీచేస్తున్నారు. ఇందులో ఎల్-1,పదిటిక్కెట్లు,ఎల్-2,ఇరవైఅయిదు టిక్కెట్లు ఇస్తున్నారు. అయితే ఈకోటా ఏమాత్రం చాలడంలేదని కనీసం 50 బ్రేక్‌దర్శనం టిక్కెట్లు ఇవ్వాలని సభ్యులు పట్టుబట్టారు. ఈప్రతిపాదనకు తిరుమల జెయిఓ అంగీకరించకపోవడంతో అభిప్రాయబేదాలు చోటుచేసుకున్నాయి. దీంతో సభ్యులు నేరుగా తిరుమల జెయిఓపై ఆయన కార్యాలయంలోని సిబ్బంది పనితీరుపై విమర్శలదాడికి దిగారు.

Comments

comments