Home జగిత్యాల భక్తజన సంద్రోహంగా కొండగట్టు

భక్తజన సంద్రోహంగా కొండగట్టు

Kondagattu

జగిత్యాల: జిల్లాలోని కొండగట్టు శ్రీఆంజనేయస్వామి దేవాలయం ఆదివారం హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. సుమారు మూడు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఎండలు బాగా ఉన్నందున ఆలయం చుట్టూ చలువ పందిళ్లు వేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్ర పోలీస్ శాఖ 52 సిసిటివి కెమెరాలు, 750 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ ఏడాది తొలిసారి భద్రాచలం శ్రీ సీతారామాలయం నుంచి ఇక్కడికి పట్టువస్త్రాలు, కానుకలు కూడా వచ్చాయి. ప్రతి సంవత్సరం వైశాఖ బహుళ దశమి నాడు హనుమాన్ జయంతి వేడుకలు కొండగట్టులో వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ.