Home తాజా వార్తలు యాదాద్రిలో భక్తుల రద్దీ

యాదాద్రిలో భక్తుల రద్దీ

Devotees Rush at Yadadri on Sunday

యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు. స్వామివారి ధర్మ దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. స్వామివారి సన్నిధిలో సత్యనారాయణస్వామి వ్రతాలు జరుగుతున్నాయని ఆలయ అర్చకులు తెలిపారు.

Devotees Rush at Yadadri on Sunday