Home జగిత్యాల కొండగట్టులో భక్తుల రద్దీ

కొండగట్టులో భక్తుల రద్దీ

KONDAGATTU

జగిత్యాల : జగిత్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూలైన్లు అన్నీ నిండిపోయి ఆలయం వెలుపల వరకు భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు పవిత్ర కోనేరులో పుణ్యస్నానం ఆచరించి, ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.