Home జయశంకర్ భూపాలపల్లి మేడారానికి పోటెత్తిన భక్తులు

మేడారానికి పోటెత్తిన భక్తులు

Medaram

జయశంకర్ భూపాలపల్లి : జనవరి 31వ తేదీన ప్రారంభమైన మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర శనివారంతో ముగియనుంది. నాలుగు రోజుల పాటు జాతర ఘనంగా జరిగింది. జాతరకు శనివారం చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. తెలంగాణ సిఎస్ జోషి, డిజిపి మహేందర్‌రెడ్డిలు శనివారం సమ్మక్క – సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జాతరలో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై వారు సమీక్ష చేశారు. మేడారం జాతరకు ఇప్పటి వరకు 90 లక్షల మంది వచ్చినట్టు అధికారులు తెలిపారు.

Devotees Rush in Medaram Jatara