Home ఆంధ్రప్రదేశ్ వార్తలు తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ సాధారణం

Devotees Rush in Normal in Tirumalaతిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తల రద్దీ సాధారణంగా ఉంది.  శ్రీవారి  దర్శనం కోసం భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుందని టిటిడి అధికారులు తెలిపారు. శ్రీవారిని మంగళవారం 95,736 మంది దర్శించుకున్నారు. 28,899 మంది తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మంగళవారం శ్రీవారి హుండీకి రూ. 3.17 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ కారణంగా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు వారు చెప్పారు.

Devotees Rush in Normal in Tirumala