Home తాజా వార్తలు రాజన్న క్షేత్రంలో భక్తుల కోలాహలం

రాజన్న క్షేత్రంలో భక్తుల కోలాహలం

Rajanna Templeవేములవాడ : ప్రసిద్ధ పుణ్య క్షేత్రం శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కోలాహలంగా కనిపించింది. భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం వేకువజామునే భక్తులు పవిత్ర ధర్మగుండంలో స్నానమాచరించి స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లో నిల్చున్నారు. స్వామి వారికి అత్యంత ప్రీతి పాత్రమైన కోడె మొక్కును చెల్లించుకున్నారు. కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. ఎత్తు బెల్లాన్ని పంచి పెట్టారు. భక్తులు గండ దీపంలో నూనె పోసి తమ మొక్కును తీర్చుకున్నారు. పలు ఆర్జిత సేవలు రద్దు చేయడం వలన భక్తులకు స్వామి వారి లఘు దర్శన ప్రాప్తి కలిగింది. అనుబంధ దేవాలయాలైన భీమేశ్వరాలయం, కేదారేశ్వలయం, నగరేశ్వరాలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. ఆలయంలో భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో కుంకుమ పూజలు, సత్యనారాయణ వ్రతాలు, కళ్యాణాల మొక్కులు, పల్లకి సేవలు, పెద్ద సేవలు, గండ దీపం మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Devotees Rush In Rajanna Temple