Home తాజా వార్తలు రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

RAJANNA

రాజన్న సిరిసిల్ల : నూతన సంవత్సరం సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. తలనీలాలు సమర్పించి, ధర్మగుండంలో స్నానమాచరించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతంర స్వామివారి దర్శనం చేసుకున్నారు. స్వామివారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Devotees Rush in Rajanna Temple