Home ఆంధ్రప్రదేశ్ వార్తలు శ్రీశైలం ఆలయ సమాచారం

శ్రీశైలం ఆలయ సమాచారం

Srisailam Templeకర్నూలు :  శ్రీశైలం ఆలయంలో ఆదివారం  భక్తుల రద్దీ పెరిగింది. శ్రీశైలంలో కన్నుల పండుగగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం గజవాహనంపై భ్రమరాంబమల్లికార్జునస్వామి గ్రామోత్సవం జరగనుందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల తాకిడి అదికంగా ఉండడంతో స్వామివారి దర్శనానికి 5గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు చెప్పారు.

Devotees Rush in Srisailam Temple