Home తాజా వార్తలు కిలోమీటరు మేర క్యూ కట్టిన భక్తులు

కిలోమీటరు మేర క్యూ కట్టిన భక్తులు

BALAJI

హైదరాబాద్ : కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని సోమవారం చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం పది గంటల వరకు సాధారణంగా ఉన్న భక్తుల సంఖ్య అనంతరం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఈ క్రమంలో బాలాజీని దర్శించుకునేందుకు భక్తులు కాలినడక ఆలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు అరవై వేల మంది భక్తులు బాలాజీని దర్శించుకున్నారు. మూడు వరుసల్లో స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయ అధికారులు భక్తులను అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు.

Devotees Rush in the Chilkur Balaji Temple