Home జాతీయ వార్తలు తిరుమల శ్రీవేంకటేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ

తిరుమల శ్రీవేంకటేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ

Devotees Rush in the Tirumala Temple

తిరుమల : తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనం కోసం 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 20గంటలు, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 75,819 మంది దర్శించుకున్నారు. 29,794 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. సోమవారం శ్రీవారి హుండీకి రూ.3.08 కోట్ల ఆదాయం సమకూరిందని టిటిడి అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశామని వారు చెప్పారు.

Devotees Rush in the Tirumala Temple