Home ఆంధ్రప్రదేశ్ వార్తలు తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ

Devotees Rush in Tirumalaతిరుమల ఆలయంలో బుధవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. దీంతో వైకుంఠం వెలుపల కిలోమీటరు మేర భక్తులు బారులు తీరారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోందని టిటిడి అధికారులు తెలిపారు. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోందని వారు చెప్పారు. మంగళవారం శ్రీవారిని 76,980 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,292 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు వెల్లడించారు.

Devotees Rush in Tirumala