తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 21 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం, టైంస్లాట్, కాలినడక భక్తులకు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుందని టిటిడి అధికారులు తెలిపారు. శనివారం 26,208 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శనివారం శ్రీవారి హుండీకి రూ. 2.06 కోట్ల ఆదాయం సమకూరిందని టిటిడి అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెప్పారు.