Home జాతీయ వార్తలు శ్రీవారి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

శ్రీవారి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

Devotees Rush in Tirumala Srivari Temple on Monday

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో వైకుంఠం కాంప్లెక్స్ వెలుపల కిలోమీటరు మేర భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు, దర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటలలోపు శ్రీవారి దర్శనం కలుగుతోంది. ఆదివారం శ్రీవారిని 87,441 మంది దర్శించుకున్నారు. 34, 113 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఆదివారం శ్రీవారి హుండీకి రూ.3.24 కోట్ల ఆదాయం సమకూరిందని టిటిడి అధికారులు తెలిపారు.

Devotees Rush in Tirumala Srivari Temple on Monday