Home ఆంధ్రప్రదేశ్ వార్తలు తిరుమల ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

Devotees Rush in Tirumala Templeతిరుమల: తిరుమల ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో వైకుంఠం వెలుపల క్యూలైన్లలో రెండు కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 24 గంటలు, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. శ్రీవారి సోమవారం 81,274 మంది దర్శించుకున్నారు. 34,972 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీకి సోమవారం 3.83 కోట్ల ఆదాయం వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు వెల్లడించారు.

Devotees Rush in Tirumala Temple