Home ఆంధ్రప్రదేశ్ వార్తలు తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ

తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ

Devotees Rush in Tirumala templeతిరుమల : తిరుమల ఆలయంలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 16 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 76,505 మంది దర్శించుకున్నారు. 25,273 మంది  తలనీలాలు సమర్పించుకున్నారు. బుధవారం శ్రీవారి హుండీకి రూ. 2.76 కోట్ల ఆదాయం సమకూరిందని టిటిడి అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ కారణంగా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు వెల్లడించారు.

Devotees Rush in Tirumala temple