Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

తిరుమల ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

Devotees Rush in Tirumala temple on Sunday

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో వైకుంఠం వెలుపల భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వ దర్శనానికి 16 గంటలు, టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 83,016 మంది భక్తులు దర్శించుకున్నారు. 44,429 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శనివారం శ్రీవారి హుండీకి రూ.3.31 కోట్ల ఆదాయం సమకూరిందని టిటిడి అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు చెప్పారు.

Devotees Rush in Tirumala temple on Sunday

Comments

comments