Home ఆంధ్రప్రదేశ్ వార్తలు శ్రీవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

శ్రీవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

Devotees Rush in Tirumala Temple on today

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు టిటిడి అధికారులు తెలిపారు. శ్రీవారి సర్వదర్శనానికి 12గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 80,245 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,259 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. సోమవారం శ్రీవారి హుండీకి రూ.2.44 కోట్ల ఆదాయం సమకూరిందని టిటిడి అధికారులు చెప్పారు.

Devotees Rush in Tirumala Temple on today