Home జాతీయ వార్తలు తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ

Devotees Rush in Tirumala today

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి 24గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారి హుండీకి రూ.3.86 కోట్ల ఆదాయం సమకూరిందని టిటిడి అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ కారణంగా లడ్డూ కౌంటర్లు, కల్యాణ కట్ట కిటకిటలాడుతున్నాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టిటిడి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Devotees Rush in Tirumala today