Home తాజా వార్తలు తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ

Devotees Rush at Tirumala Today

తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి 20 గంటలు పడుతుండగా, టైం స్లాట్ సర్వదర్శనం, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు 3 గంటల సమయం పడుతోంది. కాగా, సోమవారం శ్రీనివాసుడిని 74, 244 మంది భక్తులు దర్శించుకున్నట్లు టిటిడి అధికారులు తెలిపారు. ఇవాళ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.