Home ఆంధ్రప్రదేశ్ వార్తలు తిరుమల ఆలయ సమాచారం…

తిరుమల ఆలయ సమాచారం…

Tirumalaతిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం  భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం, టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 2 గంటల సమయం పడుతోందని ఆలయ అర్చకులు తెలిపారు. సోమవారం  శ్రీవారిని  72,907 మంది  దర్శించుకున్నారు. నిన్న 25,285 మంది  తలనీలాలు సమర్పించుకున్నారు. సోమవారం  శ్రీవారి హుండీకి రూ.4.38 కోట్ల ఆదాయం సమకూరిందని టిటిడి అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు వారు తెలిపారు.

Devotees Rush is Normal in Tirumala Temple on Tuesday