Home తాజా వార్తలు శైవక్షేత్రాలకు పోటెత్తుతున్న భక్తజనం..

శైవక్షేత్రాలకు పోటెత్తుతున్న భక్తజనం..

LORD-SHIVA

హైదరాబాద్: మహాశివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తజనం పోటెత్తుతున్నారు. ఉదయం నుంచే భక్తులు పెద్దఎత్తున బారులు తీరారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. తెలంగాణలోని ప్రసిద్ధ శైవక్షేత్రాలైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, చెర్వుగట్టు రామలింగేశ్వర స్వామి, కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయాలతో పాటు ఇతర ప్రముఖ శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు  జరుపుతున్నారు.