Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

చంద్రబాబుకు నాన్‌బెయిలబుల్ వారెంట్

Dharmabad Court Issue the non bailbable warrant to Chandrababu

ముంబయి : ఎపి సిఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు మహారాష్ట్రలోని ధర్మాబాద్  మెజిస్ట్రేట్ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. బాబుతో పాటు మంత్రి ఉమామహేశ్వరరావు, మరో 14మందికి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో చేసిన పోరాటానికి గాను కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేసింది. ఈనెల 21వ తేదీలోగా బాబుతో పాటు మిగతావారిని కోర్టులో హాజరుపర్చాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. చంద్రబాబుకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ కావడం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు తిరుపతి పర్యటనలో ఉన్నారు. మహారాష్ట్ర చేపట్టిన బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ 2010లో ఉమ్మడి ఎపిలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న టిడిపి ఆందోళనకు దిగింది. 40 మంది ఎంఎల్‌ఎలతో కలిసి చంద్రబాబునాయుడు తెలంగాణ సరిహద్దు దాటి బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో చంద్రబాబుతో పాటు 40 మంది ఎంఎల్‌ఎలను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నాటి నుంచి ఈ కేసు ధర్మాబాద్ కోర్టులో పెండింగ్‌లో ఉంది. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి ఈ కేసుకు సంబంధించి పిటిషన్ వేయడంతో మళ్లీ తెరపైకి వచ్చింది. 8ఏళ్ల తరువాత ఈ కేసును బయటకు తీయడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుపై చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Dharmabad Court Issue the non bailbable warrant to Chandrababu

Comments

comments