Home తాజా వార్తలు చంద్రబాబుకు అరెస్టు వారెంట్

చంద్రబాబుకు అరెస్టు వారెంట్

ఎనిమిదేళ్లనాటి బాబ్లీ కేసులో
జారీ చేసిన ధర్మాబాద్ కోర్టు

AP-CM

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సిఎం నారా చంద్రబాబు నా యుడుపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 21న చంద్రబాబుతో పాటు మిగతా 15 మం దిని కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశించింది. 2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు వెళ్లిన చంద్రబాబుతో పాటు 16 మందిపై కేసు నమోదైంది. ఎనిమిది ఏళ్లుగా ఒక్క నోటీసు కూడా లేకుం డా ఒకేసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తిరుమల శ్రీవారి సేవలో వుండగానే నోటీసులు వచ్చినట్లు చంద్రబాబు తెలుసుకున్నారు. కేసును కోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది. మరోవైపు కేసుపై సిఎం చంద్రబాబు న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒకే సారి ఏపీ సీఎం చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ నోటీసులు జారీ చేయడాన్ని తెలుగు దేశం నేతలు తప్పు బడుతున్నారు. చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో ఏపీలో మరోసారి రాజకీయాలు వేడెక్కనున్నాయి. మహారాష్ట్రలో గోదావరి పై నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010సంవత్సరంలో ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నేతృత్వంలో 40మంది ఎమ్మెల్యేలు బాబ్లీ సందర్శనకు బయలుదేరారు. బాబ్లీ ప్రా జెక్టు నిర్మాణం, దానికి అనుబంధంగా అనేక ఎత్తిపోతల పధకాల నిర్మాణా లు చేపట్టడం వల్ల గోదావరిలో నీటి ప్రవాహం తగ్గి, ఉత్తర తెలంగాణా ఎడారిగా మారుతుందని టిడిపిఆందోళన చేపట్టింది. తెలంగాణా సరిహద్దులు దాటి ఈ బృందం మహారాష్ట్రంలోని ధర్మాబాద్కు చేరుకుంది వెంటనే అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ తాము బాబ్లీ ప్రాజెక్టును సందర్శించాల్సిందేనని చంద్రబాబు పట్టుబట్టడం, ముందుకు చొచ్చుకు వెళ్లడంతో మహారాష్ట్ర పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. చంద్రబాబు మినహా మిగతా ఎమ్మెల్యేలపై జరిగిన లాఠీ ఛార్జిలో అనేక మంది గాయపడ్డారు. అనంతరం చంద్రబాబుతో సహా అందర్నీ అదుపులోకి తీసుకుని ఓ ఐటీఐ కాలేజీలో నిర్భందించారు. ఈ సంఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. చంద్రబాబు పై కేసులు నమోదు చేయడంతో బెయిల్ తీసుకోవాలని అక్కడి పోలీసులు కోరగా, బెయిల్ తీసుకునేందుకు నిరాకరించారు. తర్వాత చంద్రబాబును విమానం ఎక్కించి బలవంతంగా హైదరాబాదుకు పంపారు. వీరందరిపై ఐపిసి 353, 324, 332, 336, 337, 323, 504, 506, 109, 34 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులలో నిందితులుగా ఉన్న వీరిలో ఎవరు కూడా ఇంత వరకు బెయిల్ తీసుకోకపోగా కోర్టుకు హాజరు కాలేదు.
ఇలా వెలుగు చూసింది…
విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, 144సెక్షన్ ను అదుపులో ఉన్నా పట్టించుకోకపోవడం, వంటి వివిధ కారణలతో చంద్రబాబుపై కేసు నమోదయ్యాయి.8నెలల క్రితం బాబుకు అక్కడి న్యాయస్థానం కోర్టు కు హాజరుకాకపోవడంపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచీ ఈ వారెంట్ పెండింగ్‌లో ఉంది. ఇటీవల మహారాష్ట్ర వాసి ఒకరు ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ ఎందుకు అమలు చేయడంలేదంటూ పిటీషన్ వేశారు.
కేసులను కెసిఆర్ పబ్లిసిటీకి వాడుకోలేదు : గంగుల
ధర్మాబాద్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై తాజా మాజీ ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్ స్పందించారు. ధర్మాబాద్ కోర్టు జారి చేసిన అరెస్ట్ వారెంట్‌ను కూడా టిడిపి రాజకీయంగా వాడుకోవడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. బాబ్లీని అడ్డుకోవడానికి చంద్రబాబుతో పాటుతాను పోరాటం చేశాన ని చెప్పారు. ఈ కేసులో ఎ-2గా ఉన్న తనపై18కేసులు నమోదు చేశారన్నారు. ఏనాడు కేసులను పబ్లిసిటీ కోసం తాను వాడుకోలేదని వెల్లడించారు. తెలంగాణ విషయంలో కెసిఆర్, కెటిఆర్, హరీశ్‌రావులపై ఎన్నో కేసులు నమోదయ్యాయని, ఏనాడూ కూడా వారు పబ్లిసిటీ కోసం చంద్రబాబులా వాడుకోలేదని అన్నారు. రాజకీయంగా పబ్బం గడుపుకోవడానిఇక, ఎన్నికల్లో ఉనికి చాటుకోవాలని కేసులను టిడిపి వాడుకుంటోందని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని పన్నాగాలు పన్నినా ప్రజలు తిరస్కరించడం ఖాయమన్నారు.
అరెస్టు వారెంట్ జారీ అయిన నిందితులు వీరే….
చంద్రబాబు నాయుడు, జి.కమలాకర్ (కరీంనగర్), కె.ఎస్,ఎన్,ఎస్ రాజు (ఎపి), సి.హెచ్.ప్రభాకర్ (ఎపి),ఎన్.నగేశ్వర్ మల్లేశ్వర్ (ఖమ్మం), జి.బి. నాయుడు (మడవెల్ల), డి.ఉమా మహేశ్వర్‌రావు (ఎపి), సి.హెచ్.విజయరామారావు (కరీంనగర్), ముజఫరుద్దీన్ అన్వరుద్దిన్ (హైదరాబాద్), హన్మంత్ షిండే మడప్ప (నిజామాబాద్), పి.అబ్దుల్ ఖాన్ రసూల్ ఖాన్ (హిందూపురం), ఎస్.సోమజోజు (ఎపి), ఎ.ఎస్.రత్నమ్ అలియాస్ సాయన్న (రంగారెడ్డి), పి.సత్యనారాయణ సిందు (ఎపి), టి.ప్రకాష్ గౌడ్ గండయ్య (ఎపి), ఎన్.ఆనందబాబు నగేద్రం (గుంటూరు)