Home జగిత్యాల వైభవంగా నృసింహుని తెప్పోత్సవం

వైభవంగా నృసింహుని తెప్పోత్సవం

  • హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్

Dharmapuri-Celebrations

ధర్మపురి : అతి ప్రచీన పుణ్యక్షేత్రంగా ఖ్యాతి గాంచిన ధర్మపురి క్షేత్రంలో గత ఐదు రోజుల నుంచి జరుగుతున్న బ్రహ్మోత్సవ వేడుకల్లో ముఖ్యఘ ట్టంగా బావించే స్వామి వారి డోలోత్సవం, తెప్పోత్సవం ఆదివారం అత్యంత వైభ వంగా జరిగింది. స్వామి వారి తెప్పోత్సవం, డోలోత్సవం తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ధర్మపురి క్షేత్రానికి తరలి వచ్చారు. ఈ సం దర్బంగా ఉదయం 4గంటలకు వేద పండితులు బ్యాండు మేళాలతో వెల్లి గం గాతీర్థము తీసుకువచ్చి స్వామివారలకు అభిషేకము, నివేదన, నీరాజన మంత్ర పుష్పం, తీర్థప్రసాదముల వినియోగం,అర్చనలు నిర్వహించి స్వామి వారల ద ర్శించుకోవడానికి భక్తులను అనుమతించారు. అనంతరం యజ్ఞాచార్యులు కం దాలై పురుషోత్తమచార్యులు ఆద్వర్యంలో నృసింహహోమం నిర్వహించారు. నిత్య కల్యాణ మండపంలో స్వామి వారలకు కన్నుల పండువగా కల్యాణం నిర్వ హించారు. మధ్యాహ్నం 3గంటల సమయంలో శ్రీయోగ(పాత) లక్ష్మినృసింహ స్వామి వారలను పట్టు వస్త్రాలతో అందంగా ముస్తాబు చేసి వేలాది మంది భక్తులు వెంటరాగా బ్యాండు మేళాలతో బ్రహ్మపుష్కరణి(కోనేరు)కు సేవపై ఊరేగింపుగా తీసుకెల్లారు. అప్పటికే సిద్దంగా ఉన్న నూతన హంస వాహనంపై స్వామి వారల కు ఆశీనులను చేసి పుష్కరణిలోని నీటిలో ఐదు ప్రదక్షిణలు చేశారు. తెప్పోత్సవం నిర్వహిస్తుండగా స్వామివారిపై భక్తులు బుక్కాగుల్లాలు చల్లి మొక్కులు తీర్చుకు న్నారు. అనంతరం పుష్కరణి మద్యలోని బోగ మండపంపై స్వామి వారిని ఆశీ నులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మంచినీటీ సౌకర్యం, చలువ పందిల్లు, లడ్డుప్రసాదాలు, ఉచిత అన్నదానం నిర్వహించారు. జాతరలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జగిత్యాల డిఎస్పీ కరుణాకర్ నేతృత్వంలో, ధర్మపురి సిఐ చెల్పూరి శ్రీనివాస్ ఆద్వర్యంలో గట్టి పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీప్‌విప్ కొప్పుల ఈశ్వర్, జ గిత్యాల జిల్లా కలెక్టర్ ఎ శరత్, జిల్లా ఎస్‌పి అనంత్ శర్మ దంపతులు, ఆలయ స హయ కమిషనర్ నాయిని సుప్రియ, ఎంపిపి కొండపెల్లి మమత, జడ్పిటిసి సభ్యు లు బాదినేని రాజమణి రాజేందర్, స్థానిక సర్పంచ్ సంగి సత్తమ్మ, రేనవేషన్ క మిటీ సబ్యులు ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, మదు నట్రాజ్‌శర్మ, అక్కనపెల్లి సునిల్ కుమా ర్, సాయిని శ్రీనివాస్, మామిడి లింగన్న, జె రమాదేవి, రమ్య, వేంకటేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.