Home తాజా వార్తలు సూర్యాపేట ఏరియా ఆసుపత్రి ఎదుట ప్రమాద బాధితుల ధర్నా

సూర్యాపేట ఏరియా ఆసుపత్రి ఎదుట ప్రమాద బాధితుల ధర్నా

Dharna of the victims of the accident in Suryapet
సూర్యాపేట క్రైం : తాము ప్రమాదం బారిన పడి సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి వస్తే డాక్టర్లు పట్టించుకోవడం లేదని ప్రమాద బాధితులు సోమవారం రాత్రి సూర్యాపేట ఏరియా హాస్పిటల్ ముందు ధర్నా చేపట్టారు. వివరాల ప్రకారం నూతనకల్ మండలం యెడవెళ్లి గ్రామానికి చెందిన కూలీలు నాట్లు వేయడానికి డిసిఎంపై నిజామాబాద్ జిల్లా కాల్వపల్లికి ప్రయాణమయ్యారు. అప్పటికే డిసిఎం డ్రైవర్ తాగి ఉన్నట్లు కూలీలు ఆరోపించారు. వీరు ప్రయాణిస్తున్న డిసిఎం చేరియాల వద్ద ప్రమాదానికి గురైంది. పలువురికి గాయాలయ్యాయి. దీనితో కూలీలందరూ తిరిగి సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి వచ్చి చికిత్స చేయించుకోవాలని ఎదరుచూడగా డాక్టర్లు ఎవరూ లేకపోవడం, ఆసుపత్రిలో పట్టించుకోకపోవడంతో వెంటనే ఏరియా ఆసుపత్రి ఎదుట దెబ్బలు తగిలిన 35 మంది కూలీలు ధర్నాకు దిగారు. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.