Home పెద్దపల్లి జూన్ నెలలో ధరణి వెబ్‌సెట్ ప్రారంభం

జూన్ నెలలో ధరణి వెబ్‌సెట్ ప్రారంభం

peddapalli-image

రైతుల్లో ఆనందం చూడాలన్నదే కెసిఆర్ లక్షం
పెద్దపల్లి ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన

మన తెలంగాణ/సుల్తానాబాద్: రైతుల మొఖంలో సంతోషం చూడాలన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్షమని, రైతుబంధు పథకం క్రింద రైతు పట్టా పాస్ పుస్తకంతోపాటు వ్యవసాయ పెట్టుబడులకు ఎకరాకు రూ.4వేల చొప్పున చెక్కులను అం దించటం జరుగుతుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ అల్లంరాజు శ్రీదేవసేన అన్నారు. సుల్తానాబాద్ మండలంలో రైతు బందు పథకాన్ని తోగర్రాయి గ్రామంలో జిల్లా కలెక్టర్ అల్లంరాజు శ్రీదేవసేన, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిలు గురువారం సాయంత్రం ప్రారంభించారు. రైతులకు పట్టా పాస్ పుస్తకాలతో పాటు చెక్కులను పంపిణి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 2వ తేది నుండి దరణి వెబ్‌సెట్ ప్రభుత్వం ఎర్పాటు చేయనుందని అన్నారు. భూములు కోనుగోలు అమ్మకాలు అటోమేటిక్‌గా వెబ్‌సెట్‌తో  మార్పులు జరుగుతాయని ఆమె అన్నారు.  రైతు బందు పథకం క్రింద 9నెలలుగా రెవేన్యూ శాఖ సిబ్బంది కసరత్తు చేసి ఈ పంపిణి చెపట్టడం జరుగుతున్నాదని అన్నారు. అధార్ కార్డు లెకపోవటంతో కోందరి రైతుల పట్టా పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణి నిలిచి పోయిందని అన్నారు. అన్ని అరహతలు ఉన్నా రైతులకు చెక్కులను పాస్ పుస్తకాలను అందించటం జరుగుతుందని అన్నారు. సమస్యలు ఉన్నా భూములను బీ పార్ట్‌లో పెట్టి తరువాత పరిశీలించటం జరుగుతుందని అన్నారు. ఈ పట్టా పాస్ పుస్తకాల పంపిణి నిరంతర ప్రక్రియ అని అన్నారు. రైతులకు చెక్కుల రూపంలో వ్యవసాయ పెట్టుబడుల కోసం అందిస్తున్నా డబ్బు ఇప్పటికే బ్యాంకుల్లో ప్రభుత్వం జమ చేసిందని అన్నారు. ఈ చెక్కులను 3నెలల లోపు రైతులు డ్రా చెసుకోవచ్చని అన్నారు. పట్టా పాస్ పుస్తకాలు చాలా నాణ్యతతో ఉన్నాయని వాటిని రైతులు జాగ్రత్తగా కాపాడుకోవాలని అన్నారు.   పెద్దపల్లి ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో , ప్రపంచంలో ఎక్కడలేని విధంగా రైతు శ్రేయసి కోసం రైతు బందు పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ చెపట్టారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు చెపట్టి సేవలను అందిస్తున్నాదన్నారు. పెద్దపల్లి నియోజిక వర్గంలో 350 చెరువుల పూడిక తీత పనులు జరిగాయని అన్నారు. రైతు సంక్షేమం కోసం ఇంతగోప్ప కార్యక్రమాన్ని చెపట్టిందని అన్నారు. రైతు అత్మ గౌరవంతో బతకాలన్నదే ముఖ్య మంత్రి కేసిఆర్ లక్షం అని పెద్దపల్లి ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. మండలంలోని తోగర్రాయితో పాటు చిన్న బోంకూర్, కాట్నపల్లి గ్రామాలలో రైతు పట్టా పాస్ పుస్తకాలను, చెక్కులను అధికారులు పంపిణి చేశారు. తోగర్రాయి కార్యక్రమంలో పెద్దపల్లి అర్‌డిఓ పడాల అశోక్ కుమార్,  శిక్షణలో ఉన్న ఐపిఎస్ అధికారి శరత్ చంద్ర పవర్, ఎసిపి హబిబ్ ఖాన్, మండల స్పెషల్ అఫిసర్ రాజన్న, తహసీల్దార్ అంబటి రజిత, సర్పంచ్ క్యాదాసి పద్మ చంద్రమౌలి, ఎంపిటిసి కర్క తిరుమల శంకర్ రెడ్డి, వ్యవసాయ వాక జెడిఎ తిరుమల ప్రసాద్, ఎఓ సురేందర్, ఎడిఎ జాఖిర్ అలి, సింగల్ విండో చేర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మాజి ఎంపిపి పాల రామారావు, టిఆర్‌ఎస్ నేతలు పి బాలాజి రావు, బుర్ర శ్రీనివాస్ గౌడ్, తిప్పారపు దయాకర్, అర్‌ఐ రవిందర్, రెవేన్యూ సిబ్బంది రైతులు పాల్గోన్నరు.