Home తాజా వార్తలు ధోనీకి ప్రత్యామ్నాయం అవసరం లేదు: భజ్జీ

ధోనీకి ప్రత్యామ్నాయం అవసరం లేదు: భజ్జీ

Dhoni

 

చెన్నై: ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ప్రపంచ కప్‌లో టీమిండియాలో వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రత్యామ్నాయంగా మరో వికెట్ కీపర్‌ను తీసుకోవాల్సిన అవసరం లేదని భారత మాజీ ఆటగాడు, స్పినర్ హర్భజన్ సింగ్ తెలిపారు. ధోనికి గాయమైతే కెఎల్ రాహుల్‌ను ఆడించాలని సూచించారు. ధోనీకి రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్ ప్రత్యామ్నాయం కాలేరన్నారు. ధోని ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని బ్యాటింగ్ స్వేచ్ఛగా చేస్తున్నాడని కొనియాడారు. ధోనికి వెన్నునొప్పి ఉన్నప్పటికి అధిగమిస్తాడని వెనుకేసుకొచ్చాడు. ఎప్పుడు ఎలా ఆడాలో ధోనికి బాగా తెలుసునని, నాలుగో స్థానంలో విజయ శంకర్ ఆడించాలని భారత జట్టు ఆలోచనలో ఉందని కానీ అది జట్టుకే దెబ్బపడుతుందన్నారు. నాలుగో స్థానంలో రాయుడు ఆడిస్తే బాగుంటుంది కానీ ఫామ్‌లో లేడు కాబట్టి అతడి స్థానంలో రాహుల్‌ను ఆడించాలని సూచించారు. నాలుగో పేసర్‌ని తీసుకోవాల్సి వస్తే ఐపిల్‌లో ఆర్‌సిబి తరుఫున ఆడుతున్న నవదీప్ సైనీ తుది జట్టులో చోటు కల్పించాలన్నారు. నవదీప్ సైనీ గత సంవత్సరం నుంచి బాగా ఆడుతున్నాడని గుర్తు చేశారు. ఐపిఎల్‌లో ఆడిన స్టార్ ఆటగాళ్లంతా ప్రపంచ కప్ జట్టులో ఉండడంతో మరింత రసవత్తరంగా మారనుంది. స్పినర్ గా రవీంద్ర జడేజాను తీసుకోవాలని జడేజా బ్యాటింగ్ కు కూడా పనికొస్తాడని తెలిపారు.

 

Dhoni does not need any back-up in World Cup: Harbhajan