Search
Wednesday 26 September 2018
  • :
  • :

ధోనీపై ఫిక్సింగ్ ఆరోపణలు

DHONIన్యూఢిల్లీ : భారత అత్యుత్తమ కెప్టెన్‌గా పేరుగాంచిన మహేం ద్ర సింగ్ ధోనీపై ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి, మాజీ టీమిండియా మేనేజర్ సునీల్‌దేవ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేశాడు. ఉత్తర భారతదేశానికి చెందిన ఓ ఛానెల్ చేసిన స్టింగ్ ఆఫరేషన్‌లో మాట్లాడిన సునీల్‌దేవ్.. 2014 ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా మాంఛెస్టర్‌లో జరిగిన నాల్గోటెస్టులో ధోనీ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని సునీల్ దేవ్ ఆరోపించాడు. “మాంఛెస్టర్‌లో జరిగిన నాల్గో మ్యాచ్‌కు ముందురోజు భారీ వర్షం కురిసింది. పిచ్ పిరిస్థితుల దృష్టా టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకో వాలని జట్టు సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. అయితే టాస్ గెలిచిన ధోనీ ఆశ్చర్యకరంగా బ్యాటిం గ్‌ను ఎంచుకున్నాడు. ధోనీ నిర్ణయంతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్‌కాట్ కూడా షాక్ గురయ్యా డు. ఈ నిర్ణయం తన గొంతు తానే కోసుకునేలాంటిది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ధోనీ కచ్చితంగా ఫిక్సింగ్ పాల్పడ్డాడు’ అని సునీల్‌దేవ్ వెల్లడించాడు. జట్టు సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన ధోనీపై అప్పటి బోర్డు అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్‌కు తెలియజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ధోనీ నిర్ణయాన్ని శ్రీనివాసన్ ప్రశంసించాడని ఆరోపించాడు. అయితే ఈ విషయం ఇప్పటివరకు ఎందుకు మౌనంగా ఉన్నావని అడిగిన ఓ ప్రశ్నకు తనకు ప్రాణహాని ఉంటుందనే తాను ఈ విషయంపై ఇన్నాళ్లు మౌనం వహించినట్లు తెలిపాడు.

Comments

comments