Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రిటైర్మెంట్ ఆలోచనలో మిస్టర్ కూల్ ధోని?

dhoni

లీడ్స్: భారత మాజీ కెప్టెన్, సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్ర కటించే ఆలోచనలో ఉన్నాడా అనే సందేహం అంద రిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే ముగిసిన వెంటనే ధోని అంపైర్‌ను అడిగి బంతిని తీసుకున్నాడు. ధోని బంతిని తీసుకున్న వీడియో ప్ర స్తుతం సోషల్ మీడియాలో హల్ చేస్తుంది. సిరీస్‌లో గెలి చిన జట్టు సభ్యులు వికెట్లను, మ్యాచ్ బాల్‌ను తీసుకో వడం సర్వ సాధారణం. అయితే ఇంగ్లండ్‌తో చివరి వన్డేలో ఓడినా కూడా ధోని బంతిని తీసుకోవడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా ఆశించిన స్థాయిలో ఆడలేక పోతున్న ధోని రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో ఉన్నాడని, అందువల్లే బంతిని అడిగి తీసు కున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడు తున్నాయి. గతంలో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే సమ యంలో కూడా ధోని ఇలాగే అంపైర్లను అడిగి బైల్స్‌ను తీసుకున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో చివరి వన్డే ముగిసిన వెంటనే బంతిని అడిగి తీసుకోవడం రిటైర్మెంట్ వార్తలకు బలం చేకూర్చుతోంది. త్వరలోనే ధోని అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలుకుతాడనే వార్తలు బుధవారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. కొంతకాలంగా వన్డేల్లో, ట్వంటీ20లలో ధోని వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టి20, వన్డే సిరీస్‌లో కూడా విఫలమయ్యాడు. దీంతో ధోనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం అతను తప్పుకోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఈ పరిస్థితు ల్లో ధోని కూడా రిటైర్మెంట్ వైపు మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ధోని మాత్రం ఇప్పటి వరకు దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. భారత్‌కు వచ్చిన తర్వాత దీనిపై స్పందించే అవకాశం ఉంది.

Comments

comments