Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

పద్మ భూషణ్ పురస్కారాలు అందుకున్న ధోని, పంకజ్

doni

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, బిలియర్డ్ స్టార్ పంకజ్ అద్వానీలు ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీరికి ఈ అవార్డులను అందజేశారు. భారత క్రికెట్‌కు విశిష్ఠ సేవలు అందించిన ధోనికి ఈ అవార్డు దక్కింది. బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా ధోనీ భారత క్రికెట్‌కు అందించిన సేవలకు గుర్తింపుగా పద్మభూషణ్ అవార్డుతో సత్కరించారు. లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోని ఆర్మీ దుస్తుల్లోనే కవాతు చేస్తూ రాష్ట్రపతి దగ్గరకు వెళ్లి అవార్డును స్వీకరించాడు. ఈ కార్యక్రమానికి ధోని కుటుంబ సమేతంగా హాజరయ్యాడు. మరోవైపు బిలియర్డ్‌లో ఎన్నో సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన పంకజ్ అద్వానీ కూడా ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డును అందుకున్నాడు. కాగా, ఏడేళ్ల క్రితం ఇదే రోజు ధోని సారథ్యంలో టీమిండియా ప్రపంచకప్ గెలుచుకుంది. ఇలాంటి చారిత్రాత్మక రోజు ధోని పద్మభూషణ్ అవార్డును అందుకోవడం మరో విశేషం.

Comments

comments