Home లైఫ్ స్టైల్ రంజాన్ ఉపవాస సమయంలో మధుమేహ రోగులకు నియమాలు

రంజాన్ ఉపవాస సమయంలో మధుమేహ రోగులకు నియమాలు

diabetes-main

ముస్లింలకు పవిత్రమైన నెల రంజాన్. ఈ నెలరోజుల కాలంలో ప్రార్థనలు, ఉపవాసాలు వంటివి ఆరోగ్యవంతమైన ప్రతి ముస్లింకు తప్పనిసరి. వైద్య పరమైన సమస్యలు ఉన్న వ్యక్తులు అంటే మధుమేహం తదితర సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది మినహాయింపు. అయినా అధికశాతం మంది వైద్య సలహాను అధిగమించి మరీ ఈ ఉపవాసాలు చేస్తుంటారు. ఈ కారణం చేతనే అంతర్జాతీయ డయాబెటీస్ ఫెడరేషన్ (ఐడీఎఫ్), డయాబెటీస్ అండ్ రమదాన్ (డీఏఆర్)తో కలిసి మధుమేహ రోగులు ఉపవాస సమయంలో పాటించాల్సిన నియమాలపై మార్గనిర్దేశకత్వం చేశాయి. ఈ మార్గనిర్దేశకా లను ప్రధానంగా రోగులకు అవగాహన కల్పించడంతో పాటుగా ఉపవాస సమయంలో మధుమేహాన్ని నియంత్రించడం గురించి తెలిపేందుకు రూపొందించారు. తద్వారా, హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ (హెసీపీలు) మరింత అత్యాధునిక సమాచారంతో సలహాలు ఇవ్వడం తో పాటుగా తమ రోగులకు రంజాన్ సమ యంలో సహకరిస్తుంది. ఉపవాసం చేయాలనుకునే మధుమేహ రోగులు రంజాన్‌కు ముందుగానే పరిశీలన, కౌన్సిలింగ్‌ను హెచ్‌సీపీ వద్ద తీసుకోవడంతో పాటుగా డైటీషియన్ సలహాలు తీసుకోవాలి.

అతి ముఖ్యమైన ఆహార పద్ధతులు..

 • సుహార్ మరియు ఇఫ్తార్ నడుమ మీరు తీసుకునే రోజువారీ కేలరీలను విభజించుకోవాలి. అవసరమైతే 1-2 స్నాక్స్ తప్పనిసరి.
 • భోజన సమతుల్యత సరిగా ఉందని నిర్ధారించుకోండి. మీరు తీసుకునే భోజనంలో 40-50 % కార్బోహైడ్రేట్స్, 20-30 % ప్రొటీన్స్, 35% కన్నా తక్కువ ఫాట్స్ (ప్రధానంగా మోనో మరియు పాలిాచురేటెడ్ ) ఉండాలి.
 • తక్కువ గ్లిసెమిక్ ఇండెక్స్ తో పాటుగా అధిక ఫైబర్ ఫుడ్స్.. అందునా ఉపవాసానికి ముందు మరియు తరువాత నెమ్మదిగా శక్తిని విడుదల చేసే ఆహారాన్ని జోడించాలి. ఉదాహరణకు.. బీన్స్, రైస్, గ్రానరీ బ్రెడ్.
 • అధికంగా పళ్లు, కూరగాయలు, సలాడ్స్ జోడించాలి.
 • చురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారం తగ్గించుకోవాలి. ఉదాహరణకు నెయ్యి, సమోసాలు.
 • పంచదార అధికంగా ఉండే స్వీట్లను తగ్గించుకోవాలి.
 • వంట సమయంలో అతి తక్కువ నూనె వాడాలి. ఆలివ్, రాప్‌సీడ్ లాంటివి మంచిది.
 • సంధ్యాసమమం మరియు సూర్యోదయానికి నడమ హైడ్రేట్ చేసుకునేందుకు ప్రయత్నించాలి. అధికంగా నీళ్లు తాగడంతో పాటుగా ఇతర స్వీట్ లేని బేవరేజస్ తీసుకోవాలి. కేఫినేటెడ్ డ్రింక్స్ తాగకూడదు.
 • మధుమేహ రోగులకు రంజాన్ సమయంలో రెగ్యులర్‌గా ఎస్‌ఎంబీఐ తప్పనిసరి.
 • సూర్యోదయానికి మునుపే తినేందుకు ప్రయత్నించండి. అప్పుడు మాత్రమే తరువాత రోజు ఉపవాసం ఉంటారు.
 • హైపో లేదా హైపర్ గ్లిసెమియా పరిస్థితి తలెత్తి నప్పుడు ఉపవాసాన్ని బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉండాలి.
 • గ్లూకోజ్ స్థాయి 80ఎంజీ/డీఎల్ (హైపో గ్లిసెమియా) కన్నా తక్కువ ఉన్నప్పుడు 15 గ్రాముల కార్బోహైడ్రేట్స్‌ను ఏదైనా ఈ దిగుమ మార్గాల్లో తీసుకోండి. 3 టీ స్పూన్‌ల గ్లూకోజ్ పౌడర్ లేదా అరకప్పు యాపిల్ లేదా ఆరెంజ్ జ్యూస్ లేదా ఒక సర్వింగ్ గ్లూకోజ్ జెల్ లేదా 3-4 గ్లూకోజ్ టాబ్లెట్స్ లేదా 5-6 పీస్‌ల హార్డ్ కాండీ లేదా ఒక టేబుల్ స్పూన్ పంచదార లేదా తేనె తీసుకోవాలి. 15 నిమిషాలు ఆగి గ్లూకోజ్ స్థాయి పరీక్షించుకోవాలి. ఆ తరువాత ఈవెనింగ్ మీల్ తీసుకోవడానికి ఒక గంట కన్నా ఎక్కువ లేదనుకున్న సమయంలో స్నాక్ తీసుకోవాలి.

చికిత్స పర్యవేక్షణ : 

 • మెటాఫార్మిన్, షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ సీక్రెటాగోగ్యుస్, ఎస్‌యులు లేదా ఇన్సులిన్ తీసుకునే రోగులు తమ డోసేజ్‌ను సరి చేసుకోవడం లేదా హైపోగ్లిసెమియా ప్రమాదం తగ్గించుకోవడానికి సమయాన్ని తగ్గించుకోవడం ద్వారా సరి అయిన గ్లిసామిక్ కంట్రోల్ సాధ్యమ వుతుంది.
 • ఇన్‌క్రెటిన్ ఆధారిత థెరఫీలు, ఆల్ఫా గ్లూకోసిడేస్ ఇన్హిబిటర్స్, టీజెడ్‌డీలు, డీపీపీ4 ఇన్హిబిటర్స్‌తో సహా ఓరల్ యాంటీ డయాబెటీస్ డ్రగ్స్ సురక్షితంగా కనిపిస్తాయి. అతి తక్కువ హైపోగ్లిసెమియా ప్రమాదాన్ని కలిగి ఉంటాయి. రంజాన్ సమయంలో ఇవి ఉపయోగించడానికి ప్రాధాన్యతివ్వవచ్చు.
 • ఎస్‌జీఎల్‌టీ2 ఇన్హిబిటర్లు బహుా సురక్షితం కానీ కొంత మంది రోగులు వీటిని ఉపయో గించడంలో జా గ్రత్తగా ఉండాల్సి ఉం ది. రంజాన్ సమయంలో ఎస్‌జీఎ ల్‌టీ2 ఇన్హి బిటర్లకు సంబంధించిన మరింత సమాచారం ఇంకా రావాల్సి ఉంది.
 • ఫిజీషియన్ సలహాలకు అనుగుణంగా తప్పనిసరిగా మందులను తీసుకోవాలి.