Search
Sunday 18 November 2018
  • :
  • :

విజయ్ మాల్యాపై డియాజియో కేసు

malya40 మిలియన్ల డాలర్లు రాబట్టేందుకు చర్య

న్యూఢిల్లీ: వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై 40 మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ కేసు వేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో యునైటెడ్ స్పిరిట్స్ లి. చైర్మన్ పదవి నుంచి విజయ్‌మాల్యా తొలగిపోవడంతో ఆయనకు ఇదివరకే చెల్లించిన ఆ మొత్తాన్ని తిరిగి పొందేందుకు ఈ కేసు వేసింది. 75 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని మాల్యా ఉల్లంఘించాడంటూ పేర్కొంది. డియాజియో లండన్‌లో ఈ కేసును వేసింది. మాల్యా వల్ల ఏర్పడిన నష్టాన్ని అది తన వార్షిక నివేదికలో తెలిపింది. ఆ నివేదిక ఆగస్టులో విడుదలైంది. మాల్యా, ఆయన కుమారుడు సిద్ధార్థ్‌కు చెందిన అనుబంధ కంపెనీలకు చెల్లించిన 141 మిలియన్ డాలర్ల చెల్లింపు గురించి కూడా తన కేసులో ప్రశ్నించింది.
కింగ్ ఎయిర్‌లైన్స్ లి. పనిచేయకపోవడం, మాల్యా చాలా బ్యాంకులకు అప్పులు బాకీ పడ్డంతో 2016 మార్చిలో ఇంగ్లాండుకు పారిపోయాడు. ఐదేళ్ల వరకు కలుగజేసుకోనని, హక్కులు కోరనని మాల్యా ఒప్పందం చేసుకుని యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీని ఇవ్వడానికి ఒప్పుకోవడంతో డియాజియో 75 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అందులో 40 మిలియన్ డాలర్లను చెల్లించింది కూడా. 2013లో అది మొదటిసారి కొనుగోలు చేసినప్పటి నుంచి యునైటెడ్ స్పిరిట్స్‌లో 55 శాతం వాటాలను సేకరించింది. డిసెంబర్‌లో విజయ్‌మాల్యా అప్పగింత కేసు లండన్‌లో విచారణకు రానున్న నేపథ్యంలో డియాజియో ఈ కేసు వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదిలా ఉండగా బెయిల్‌పై విడుదలైన విజయ్ మాల్యా డియాజియో కేసును తన న్యాయవాది సమీక్షిస్తున్నాడని, తన మీద వచ్చే ఏ కేసునైనా ఎదుర్కొంటానని అన్నారు. భారత్‌లోని మోసం అభియోగాలను కూడా ఆయన తిరస్కరించారు.

Comments

comments